calender_icon.png 19 January, 2026 | 1:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోడ్డు మధ్యలో ఆగిన లారీ

09-09-2024 12:07:47 PM

దాదాపు రెండు కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు 

సిద్దిపేట: జిల్లా కొండపాక మండలం రాజీవ్ రహదారిపై హైదరాబాద్ వైపు నుండి సిద్దిపేట వైపు వెళ్లే లారీ యూటర్న్ చేసుకునే సందర్భంలో లారీ రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్లు ఎక్కి, అటు ముందుకు ఇటు వెనుకకు రాకుండా డివైడర్ల మధ్యలో టైర్లు ఇరుక్కుపోవడం వల్ల లారీ మధ్యలో ఆగిపోయింది. ఈ విధంగా రోడ్డుపైన ఆగిపోవడం వల్ల రోడ్డుపై దాదాపు రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. టోల్ ప్లాజా కి ఫోన్ చేసి కంటైనర్ తీసుకొచ్చి లారీని వెనకకి తీశారు.