ప్రీ ప్రైమరీ టీచర్ ట్రైనింగ్ అభ్యర్ధులకు సర్టిఫికెట్లు అందజేసిన జివి కిరణ్ కుమార్
కొత్తగూడెం,(విజయక్రాంతి): సింగరేణి సేవా సమితి కార్పొరేట్ ఏరియా ఆధ్వర్యంలో 2025-26 సంవత్సరం లో,సింగరేణి సేవా సమితి ద్వారా 6 నెలల పాటు ప్రీ ప్రైమరీ టీచర్ ట్రైనింగ్ శిక్షణ పొందిన 52 మంది అభ్యర్ధులకు, శనివారం సింగరేణి ఉన్నత పాటశాలలో జిఎం(పర్సనల్) వెల్ఫేర్ & సిఎస్‌ఆర్ జి.వి.కిరణ్ కుమార్, ప్రీ ప్రైమరీ టీచర్ ట్రైనింగ్ సర్టిఫికెట్లను అందజేశారు. ఈ సంధర్భం కిరణ్ కుమార్ మాట్లాడుతూ... సింగరేణి సంస్థ సామాజిక భాధ్యతగా సింగరేణి గృహీణులతో పాటు పరిసర ప్రాంత నిరుద్యోగ మహిళలు కూడా ఆర్ధికంగా ఎదగాలనే ఉద్దేశంతో కంపెనీ వ్యాప్తంగా సింగరేణి సేవా సమితి ద్వారా ఎన్నోవృత్తి విద్యాకోర్స్ లను నిర్వహిస్తున్నదని
అందులో భాగముగా 2025-26 సంవత్సరంలో 6 నెలల పాటు సింగరేణి ఉన్నత పాటశాలలో ప్రీ ప్రైమరీ టీచర్ ట్రైనింగ్ శిక్షణ పొంది పరీక్షలలో ఉత్తీర్ణులైన 52 మంది అభ్యర్ధులకు, సర్టిఫికెట్ల ను అందిస్తున్నామని, సింగరేణి సంస్థ ఇప్పటి వరకు 13 బ్యాచ్ లకు ఉచితముగా ప్రీ ప్రైమరీ టీచర్ ట్రైనింగ్ శిక్షణ అందించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిఎం(పర్సనల్) వెల్ఫేర్ & సిఎస్‌ఆర్ జి.వి.కిరణ్ కుమార్ తో పాటు, డిజిఎం(పర్సనల్) బి.శివ కేశవ రావు, వెల్ఫేర్ పిఏ కే.వరప్రసాద రావు, సేవ సెక్రటరీ బి.మాధవీ స్వర్ణలత, శిక్షణాధ్యాపకులు ఏ.ఇందిర, జి.కళ్యాణి,శిక్షణ పొందిన అభ్యర్ధులు పాల్గొన్నారు.






