26 March, 2026 | 2:50 AM

ఉత్సాహంగా జీవీసీసీ క్రికెట్ ఛాంపియన్‌షిప్

26-03-2026 12:00 AM

హైదరాబాద్, మార్చి 25 : నిత్యం క్రియేటివ్ డిజైన్లు రూపొందిస్తూ బిజీగా ఉండే ఆర్కిటెక్చర్ల కోసం ఏర్పాటు చేసిన గోద్రేజ్ వాల్యూ కో క్రియేటర్స్ క్లబ్(జీవీసీసీ) క్రికెట్ ఛాంపియన్‌షిప్ 2026 ఉత్సాహంగా ముగిసింది. తమ కంపెనీ ఉద్యోగులకు ఆటవిడుపుగా గోద్రేజ్  నిర్వహించిన మూడో ఎడిషన్ ఇది. దాదాపు 16 జట్లకు 236 మంది ఆర్కిటెక్ట్స్, ఇంటీరియర్ డిజైనర్స్ ఈ క్రికెట్ టోర్నీల్లో పాల్గొన్నారు.

హోరాహోరీగా సాగి న ఈ పోటీల్లో ఎస్‌పీఏ ఎలెవన్ విజేతగా నిలిచింది. ఫైనల్‌లో ఎస్‌ఎస్‌ఏ స్ట్రుకర్స్‌పై ఎస్‌పీఏ ఎలెవన్ విజయం సాధించింది.పని ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగించే ఉద్దేశంతో ప్రతీ ఏటా ఈ క్రికెట్ టోర్నీ నిర్వహిస్తున్నట్టు కంపెనీ తెలిపింది.అదే సమయంలో ఉద్యోగల మధ్య మరింత బాండింగ్ ఆటల ద్వారానే ఏర్పడుతుందని పేర్కొంది.