ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో దినేష్ కార్తీక్
- చెన్నైస్ అమృత విద్యార్థుల వినూత్న ప్రయత్నం
- కార్తీక్ జెర్సీ నెం.19తో భారీ మానవహారం
చెన్నై, మార్చి 25: భారత మాజీ క్రికెటర్ దిశేష్ కార్తీక్‌పై తమకు ఉన్న అభిమానాన్ని చెన్నైస్ అమృత విద్యాసంస్థల విద్యార్థులు వినూత్నంగా చాటుకున్నారు. చెన్నైలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో తమ వార్షిక క్రీడోత్సవాల్లో భాగంగా కార్తీక్ జెర్సీ నెం.19 ఆకారంలో భారీ మానవహారాన్ని ఏర్పాటు చేశారు. ఈ వినూత్న ప్రయత్నంలో తమిళనా డు, ఏపీ, తెలంగాణ, కేరళ, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన అమృత విద్యాసంస్థలకు చెందిన 3 వేల మంది విద్యార్థులు పాల్గొన్నారు. వీరంతా కలిసి సీఏడీకే ఆకారంలో మానవహారంగా నిలబడి అబ్బురపరిచారు.
ఒక ప్లేయర్ జెర్సీని ప్రతిబింబించే మానవహారంలో అత్యధిక మంది విద్యార్థులు పాల్గొన్న రికార్డుగా దీనికి ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్, ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కింది. చెన్నైసీ అమృత గ్రూప్ ఛైర్మ్ ఆర్.భూమినాథన్ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమానికి క్రికెటర్ దినేష్ కార్తీక్ , తమిళనాడు ఎంజీఆర్ మెడికల్ యూనివర్సిటీ వీసీ డాక్టర్ కే.నారాయణస్వామి జరయ్యారు.క్రీడలతోనే వ్యక్తిత్వ వికాసం సాధ్యమవుతుందని ఈ కార్యక్రమం ద్వారా నిరూపితమైందని భూమినాథన్ చెప్పారు.




