జీపీ కార్మికులకు కనీస వేతనం ఇవ్వాలి
మహబూబాబాద్, జూన్ 1 (విజయక్రాంతి): పంచాయతీ కార్మికులకు కనీస వేతనం కింద నెలకు 26 వేల రూపాయలు చెల్లించాలని, 10 లక్షల బీమా పథకం అమ లు చేయాలని తెలంగాణ గ్రామ పంచాయ తీ ఎంప్లాయిస్, వర్కర్స్ (సీ ఐ టీ యూ) రా ష్ట్ర కమిటీ పిలుపుమేరకు సోమవారం నెల్లికుదురు ఎంపీడీవో కు వినతి పత్రం అందజే శారు.
ఈ సందర్భంగా ఆ సంఘం నేతలు మాట్లాడుతూ నిత్యం ప్రజలకు సేవలు అందిస్తున్న గ్రామపంచాయతీ కార్మికులకు కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలని, పది లక్షల ఇన్సూరెన్స్ ఇవ్వాలని, ప్ర మాదంలో మరణిస్తే కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని, రెండవ పిఆర్సి పరిధిలోకి పంచాయతీ సిబ్బందిని తీసుకురావా లని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి పెరుమాండ్ల బాబు గౌడ్, జిల్లా ఉపాధ్యక్షుడు ఎల్లయ్య, మండల కార్యదర్శి బి.వెంకన్న, కృష్ణ, వెంకన్న, రామకోటి, వెంకటమ్మ, శ్రావణి, యాకయ్య తదితరులు పాల్గొన్నారు.






