calender_icon.png 2 November, 2025 | 3:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హెచ్ ఫీజు పెంపుపై పునరాలోచించాలి !

02-11-2025 01:19:18 AM

ట్రంప్‌ను కోరిన అమెరికా చట్టసభ సభ్యుల బృందం

వాషింగ్టన్, నవంబర్ 1: అమెరికా అధ్యక్షు డు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన హెచ్ వీసాల ఫీజు పెంపు నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో వీసాల ప్రకటనను పునఃపరిశీలించాలని తాజాగా అమెరికా చట్టసభ సభ్యుల బృందం ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను కోరింది. ఈ ఫీజు పెంపు అమెరికా ఆర్థిక వ్యవస్థను, ముఖ్యంగా కృత్రిమ మేధస్సు వంటి కీలక సాంకేతిక రం గాలలో దేశ నాయకత్వాన్ని దెబ్బతీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.

అమెరికా చట్టసభ సభ్యుల బృందం ప్రతినిధులు జమ్మీ పనెట్టా, అమీ బెరా, సలుద్ కార్బజల్, జూలీ జాన్సన్ తాజాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు లేఖ రాశారు. ముఖ్యంగా హెచ్ వీసాల ఫీజు ల పెంపు గురించి ఈ లేఖలో పేర్కొన్నారు. ’హెచ్ గ్రహీతల్లో అత్యధిక వాటాను భారతీయులు కలిగి ఉన్నారు.. వారిలో ఎక్కు వ మంది సమాచార సాంకేతిక, కృత్రిమ మేధస్సులో అమెరికా నాయకత్వానికి కేంద్రంగా ఉన్నారు.

వీసాల విషయం భారత్, అమెరికా మధ్య సంబంధాలకు కూడా ఎంతో కీలకం. ఇలాంటి వీసా విధానం ఇండో అమెరికాకు అత్యంత సన్నిహిత ప్రజాస్వామ్య మిత్రదేశాల్లో ఒకటైన భారత్‌తో సంబంధాలను దెబ్బతీస్తుంది. వీసాల అమలువల్ల కీలకమైన ప్రజాస్వామ్య భాగస్వామితో వ్యూహాత్మకంగా అమెరికా భాగస్వామ్యం బలపడుతోంది. మరో వైపు ఏఐ, ఆధునాతన సాంకేతికలతో చైనా దూకుడుగా పెట్టుబడు లు పెడుతున్న సమయంలో మనం ప్రపంచంలోని అత్యుత్తమ ప్రతిభను ఆకర్షించడా న్ని కొనసాగించాలి.

హెచ్‌ఏ వీసాల అమ లు అంటే కేవలం ఉద్యోగాలను మాత్రమే భర్తీ చేయడం కాదు. ఇది 21వ శతాబ్దంలో ప్రపంచ శక్తిని నిర్వచించే పరిశ్రమల్లో అమెరికా నాయకత్వాన్ని చూపించడం. వీసాల ఫీజు పెంపు పెద్ద కంపెనీలకు కొంత అనుకూలంగా ఉన్నప్పటికీ నైపుణ్యంపై ఆధారపడే స్టార్టప్‌లు, పరిశోధన సంస్థలను గుదిబండగా మారుతుంది’ అని హెచ్చరించారు. కాగా హెచ్ వీసాలను కంపెనీలు దుర్వినియోగం చేస్తున్నాయని, స్థానిక అమెరికన్ యువత స్థానంలో తక్కువ జీతాలకు విదేశీ కార్మికులను నియమిస్తున్నారని అమెరికా లేబర్ డిపార్ట్‌మెంట్ ఆరోపించింది. 

అణుపరీక్షలపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు

అణ్వాయుధ పరీక్షల పునఃప్రారంభంపై తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ప్రపంచ దేశాల్లో ఉత్కం ఠ రేపాయి. ఆ దేశంలో చివరిసారి 30 క్రితం అణు పరీక్షలు నిర్వహించగా, ఇప్పుడు మరోసారి ఆ అంశం తెరమీదకు వచ్చింది. ఇటీవల ఓ మీడియా సంస్థ ఆయన్ను ‘మళ్లీ భూగర్భ అణు పరీక్షలు తిరిగి ప్రారంభిస్తారా?’ అని ప్రశ్నించగా, ఆయన ‘త్వరలో ఆ అం శంపై మీకు తెలుస్తుంది.

మేం కొన్ని పరీక్షలు చేయదలుచుకున్నాం’ అంటూ ట్రం ప్ పరోక్షంగా సంకేతమిచ్చారు. రష్యా, చైనా వంటి దేశాలు అణ్వాయుధాలను సమకూర్చుకుంటున్న సమయంలో ట్రంప్ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకున్నది. ట్రంప్ వ్యాఖ్య ల ప్రకారం.. ఈ వారం ప్రారంభంలోనే అణు పరీక్షలు జరుగుతాయని తెలిసిం ది. ఒకవేళ అణు పరీక్షలు ప్రారంభమైతే, ఆ దేశంలో అణు పరీక్షలపై 33 ఏళ్ల నుంచి అమలవుతున్న నిషేధానికి స్వస్తి పలికినట్లే.

ఒక్క నెలలో రూ.62 వేల కోట్లు ఆవిరి

  1. అమెరికా షట్‌డౌన్ ఎఫెక్ట్

కాంగ్రెషనల్ బడ్జెట్ ఆఫీస్ స్పష్టీకరణ

వాషింగ్టన్, నవంబర్ 1: కీలకమైన బిల్లులపై అధికార, విపక్ష చట్టసభ సభ్యుల మధ్య సయోధ్య కుదరకపోవడంతో అమెరికా ప్రభుత్వం షట్‌డౌన్ సమస్యను ఎదుర్కొంటున్నది. 31 రోజులుగా కొనసాగుతున్న షట్‌డౌన్ కారణం గా అమెరికా సంపదలో 7 బిలియన్ డాలర్లు (రూ.62,149 కోట్లకు పైగా) శాశ్వతంగా ఆవిరైనట్లు కాంగ్రెషనల్ బడ్జెట్ ఆఫీస్ (సీబీఓ) అంచనా వేసింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఆర్థిక నష్టం మరింత పెరిగే అవకాశం ఉందని హెచ్చరించింది.

షట్‌డౌన్ ప్రభావం ఆ దేశ ఆర్థికవ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపనుందని ‘కేపీఎంజీ’ చీఫ్ ఎకానమిస్ట్ డయా న్ స్వాంక్ అభిప్రాయపడ్డారు. 1981 నుంచి అమెరికా ప్రభుత్వం ఇప్పటివర కు 15 సార్లు షట్‌డౌన్ సమస్యను ఎదుర్కొంది. ట్రంప్ అధ్యక్షుడిగా కొనసాగిన 2018 మధ్య నెలరోజుల పాటు షట్‌డౌన్ పరిస్థితి వచ్చింది. దేశ చరిత్రలోనే అది సుదీర్ఘమైన షట్‌డౌన్‌గా నిలి చింది. ప్రస్తుత షట్‌డౌన్ ఆ రికార్డును అధగమిస్తుందని విశ్లేషకులు చెప్తున్నారు.