తాడ్వాయిలో వడగళ్ల వాన.. అపార నష్టం..
రూ. 20 లక్షల ఆస్తి నష్టం..
కామారెడ్డి/తాడ్వాయి/బిచ్కుంద, ఏప్రిల్, 6 (విజయ క్రాంతి ): కామారెడ్డి జిల్లా లో శనివారం అర్ధరాత్రి దంచి కొట్టిన వానతో రైతుల పంటలు అతలాకుతులమయ్యారు. కామారెడ్డి డివిజన్ తో పాటు తాడ్వాయి, బిచ్కుంద మండ లాలలో కురిసిన వడగండ్ల వర్షానికి వేలాది ఎకరాల పంట పొలాలు, మొక్కజొన్న,పంటలు నేల కొరిగాయి. శనివారం రాత్రి కురిసిన వడగండ్ల వానకు అపార నష్టం వాటిల్లింది. రూ 50లక్షల వరకు పంట నష్టం జరిగినట్లు రైతులు తెలిపారు. ఒక్కసారిగా వడగండ్ల వాన విరుచుకు పడడంతో పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి.
ఉరుములు మెరుపులతో పాటు బలమైన ఈదురుగాలులుతో కూడిన వర్షం రెండు గంటలసేపు కొనసాగింది. దీంతో పంటలు బాగా దెబ్బతిన్నాయి. కామారెడ్డి మండలం, మాచారెడ్డి, దోమకొండ, భిక్కనూర్, రామారెడ్డి, రాజంపేట, తాడ్వాయి మండలాల్లోని ఆయా గ్రామాల్లో, తాడువాయి మండలం దేమికలాన్, కతాడ్వాయి, ఎర్రపహాడ్, నందివాడ, చందాపూర్, కృష్ణాజివాడి, బ్రహ్మాజీ వాడి, చిట్యాల, ఏండ్రి యాల గ్రామాల్లో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. మొక్కజొన్న పంటలు పూర్తిగా నేలకొరికాయి.
చేతికాడికి వచ్చిన పంట ఒక్కసారిగా వడగండ్ల వాన కారణంగా నేలకొరడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. మరికొన్ని రోజులు అవుతే వంట చేతికి వచ్చే సమయంలో ఒక్కసారిగా వడగండ్ల వాన పంటను తీవ్రంగా నష్టపరచందని రైతులు బోరుమంటున్నారు. మండలంలో వేసుకున్న గోధుమ,, కూరగాయల పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అధికారులు స్పందించి వడగండ్ల వానకు దెబ్బతిన్న పంటలను గుర్తించి నష్టపరిహారం అందించేలా చర్యలు తీసుకోవాలని రైతులకు కోరుతున్నారు.




