6 April, 2026 | 2:45 AM

సమాజానికి మార్గదర్శకుడు జగ్జీవన్ రామ్

06-04-2026 12:00 AM

భిక్కనూర్, ఏప్రిల్ 5 (విజయ క్రాంతి): భిక్కనూర్ మండలం రామేశ్వర్పల్లి గ్రామంలో స్వాతంత్య్ర సమరయోధుడు, భారతదేశ తొలి ఉప ప్రధాని స్వర్గీయ డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి మాట్లాడుతూ జగ్జీవన్ రామ్ సామాజిక న్యాయం, సమానత్వం కోసం చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చేపూరి రాణి రాజు, ఉపసర్పంచ్ వినోద్ గౌడ్, వీడీసీ అధ్యక్షులు మద్ది సూర్యకాంత్ రెడ్డి, ఏఎంసీ డైరెక్టర్ నాగర్తి రమేష్ రెడ్డి, రైతు సమన్వయ సమితి మాజీ డైరెక్టర్ తక్కల బాపురెడ్డి, వార్డు సభ్యులు మద్ది కృష్ణారెడ్డి, ఒడ్డే శశికుమార్, పనాసరాజు, అంబేద్కర్ సంఘం అధ్యక్షులు చేపూరి అశోక్, సభ్యులు చేపూరి అనిల్, రమేష్, సుమన్, స్వామి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

దేశాభివృద్ధికి విశేషంగా కృషిచేసిన గొప్ప వ్యక్తి బాబు జగ్జీవన్ రామ్ 

కామారెడ్డి అడిషనల్ ఎస్పీ నర్సింహారెడ్డి 

కామారెడ్డి, ఏప్రిల్ 5 (విజయక్రాంతి): దేశాభివృద్ధికి బాబురా జగ్జీవన్ రావ్ చేసిన సేవలు చిరస్మరణీయమని కామారెడ్డి అదనపు ఎస్పి నరసింహ రెడ్డి అన్నారు. ఆదివారం కామారెడ్డి ఎస్పీ కార్యాలయంలో బాబు జగ్జీవన్‌రావు జయంతిని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన అడిషనల్ ఎస్పి నరసింహారెడ్డి మాట్లాడారు. జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఆదేశాల మేరకు బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత స్వాతంత్ర సమరంలో బాబు జగ్జీవన్ రామ్ పోషించిన పాత్ర విశిష్టమైందని కొనియాడారు. స్వాతంత్రం అనంతరం వివిధ కీలక మంత్రిత్వ శాఖలు నిర్వహిస్తూ దేశ అభివృద్ధికి ఆయన విశేషంగా  కృషి చేశారని గుర్తు చేశారు. సామాజిక న్యాయం సమానత్వం కోసం ఆయన చేసిన సేవలు ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయమని పేర్కొన్నారు.  జిల్లా పోలీసు అధికారులు కార్యాలయ సిబ్బంది పాల్గొని బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

పెద్దమల్లారెడ్డిలో..

భిక్కనూర్, ఏప్రిల్ 5(విజయ క్రాంతి): భిక్కనూర్ మండలం పెద్దమల్లారెడ్డి గ్రామంలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. నాయకులు మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రామ్ సమానత్వం, సామాజిక న్యాయం కోసం కృషి చేసిన మహానుభావుడని కొనియాడారు. ఆయన ఆశయాలను అనుసరిస్తూ సమాజ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కోడూరి సాయగౌడ్, ఉప సర్పంచ్ చైతన్య కొండల్ రెడ్డి,వార్డు సభ్యులు మాధవరెడ్డి, నట్ట లింగం, రాకేష్ గ్రామ పెద్దలు మరియు నాయకులు పాల్గొన్నారు.

బాబు జగ్జీవన్ రామ్ సేవలు అభినందనీయం 

నాగిరెడ్డిపేట్, ఏప్రిల్ 5 (విజయ క్రాంతి): బాపు జగ్జీవన్ రామ్ సేవలు అభినందనీయమని మండల అధికారులు పలువురు నాయకులు తెలిపారు. మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఆయా గ్రామాల గ్రామపంచాయతీ కార్యాలయలలో బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి వేడుకలు జరుపుకున్నారు. మండల పరిషత్ కార్యాలయంలో ఎల్లారెడ్డి డిఎల్పిఓ సురేందర్, మండల ఇన్చార్జ్ ఎంపీడీవో ప్రవీణ్ కుమార్, సీనియర్ అసిస్టెంట్ ప్రకాష్లు గోపాల్పేట్, మాల్తుమ్మెద, ధర్మారెడ్డి గ్రామాలలో సర్పంచులు వంశీకృష్ణ గౌడ్, పుప్పాల సాయిలు, గులపల్లి లక్ష్మీనారాయణలు బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.