23 March, 2026 | 1:13 PM

శ్రీవరసిద్ధి వినాయక కమిటీ ప్రధాన కార్యదర్శిగా హాజీ నాయక్

23-03-2026 12:00 AM

కోదాడ, మార్చి 22 : కోదాడ 19వ వార్డు భవానీ నగర్ లోని శ్రీ వరసిద్ధి వినాయక దేవాలయ కమిటీ ప్రధాన కార్యదర్శిగా హాజీ నాయక్ ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శనివారం జరిగిన ఎన్నికలో వార్డ్ కౌన్సిలర్ కోటిరెడ్డి, పెద్దల సమక్షంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఈ సందర్భంగా హాజీ నాయక్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.  గతంలో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గా పనిచేసి పదవీ విరమణ చేసిన ఆయన, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం కోదాడ శాఖ ఆర్గనైజింగ్ సెక్రెటరీగా కొనసాగుతున్నారు.