బీఆర్‌ఎస్ స్కాములన్నీ సీబీఐకి అప్పగించండి
- విచారణ మీరు చేస్తూ.. మమ్మల్ని అరెస్ట్ చేయమంటారా?
- విచారణ మీరు చేస్తూ.. మమ్ముల్ని అరెస్ట్ చేయమంటారా?
- చీకటి ఒప్పందాలు చేసుకొని మాపై బురద జల్లుతారా!
- కేంద్రమంత్రి బండి సంజయ్‌కుమార్
హైదరాబాద్, ఫిబ్రవరి 24 (విజయక్రాంతి): రేవంత్ సర్కార్‌కు చిత్తశుద్ధి ఉంటే గత ప్రభుత్వంలో జరిగిన స్కాములన్నింటిని సీబీఐ విచారణ జరపాలంటూ కేంద్రానికి లే ఖ రాయాలని కేంద్రమంత్రి బండి సంజయ్‌కుమార్ సవాలు విసిరారు.
అప్పుడు ఆయా కేసుల్లో దోషులెవరైనా అరెస్ట్ చేసి బొక్కలో వేయించే బాధ్యత కేంద్రం తీసుకుంటుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కోరకుండా, న్యాయ స్థానాల ఆదేశాలివ్వకుండా సీబీఐ తనంతట తాను విచారణ జరిపే అధికారం లేదన్న విషయం తెలిసి సీఎం స్థాయి వ్యక్తి కేంద్రంపై బురదజల్లడం ఆయన దివాళాకోరుతనానికి నిదర్శనమని సోమవారం ఓ ప్రకటనలో విమర్శించారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన ప్రసంగమంతా పచ్చి అబద్ధాలతో నిం డిందని సంజయ్ ఆరోపించారు.
ఎమ్మె ల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థికి ఓటమి ఖాయమనే భయం ఆయనలో స్పష్టంగా కన్పి స్తోందన్నారు. ఇంటెలిజెన్స్ సహా సర్వే సంస్థలన్నీ బీజేపీ గెలుపు తథ్యమని తేల్చేశాయని.. కాంగ్రెస్ 3వ స్థానానికి పడిపోతుందని నివేదికలివ్వడంతో సీఎం రేవంత్‌రెడ్డికి దిక్కు తోచని పరిస్థితి ఏర్పడిందన్నారు. చరిత్రలో ఇంతవరకు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో ఏ ముఖ్యమంత్రి పాల్గొనలేదన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డినా? మేమా?
ఫోన్ ట్యాపింగ్, ఫార్ములాఈ రేసు, గొర్రెల స్కాములపై సీఎం రేవంత్‌రెడ్డి వ్యా ఖ్యలు చూస్తే... ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డినా? లేక మేమా? అన్న సందేహం కలుగుతుందని బండి సంజయ్ ఎద్దేవాచేశారు. లా అం డ్ ఆర్డర్ రాష్ట్ర పరిధిలోనిదని.. కేసీఆర్ కుటుంబం, బీఆర్‌ఎస్ నేతలు స్కాములు చేసింది రాష్ర్టంలోనేనన్నారు. దోచుకున్న సొమ్మంతా తెలంగాణ ప్రజలదేనని.. విచారణ చేస్తున్నది రాష్ట్ర ప్రభుత్వమేనన్నారు. లా అండ్ ఆర్డర్ రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ చేతిలో ఉందని... కానీ కేంద్రంపై నిందలు వేయడం చూస్తుంటే నవ్వొస్తోందన్నారు.
ప్రభాకర్‌రావు, శ్రవణ్ విదేశాలకు పోతే... కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు సహా ఆయా స్కా ముల సూత్రధారులు తెలంగాణలోనే ఉన్నా రు కదా మరి వాళ్లను ఇన్నాళ్లుగా ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు. బీసీ రిజర్వేషన్ల విషయంలోనూ సీఎం రేవంత్‌రెడ్డి అబ ద్ధాలతో ప్రజలను మభ్యపెడుతున్నారని బం డి పేర్కొన్నారు. రాష్ట్రంలో ఉన్న ముస్లింలలో 80 శాతం మందిని బీసీ జాబితాలో చేర్చి, రిజర్వేషన్లు అమలు చేసి నిజమైన బీసీ బిడ్డల పొట్టగొడుతుంటే చూస్తూ ఊరుకోవాలా? బరాబర్ మతపరమైన రిజర్వేషన్లను వ్యతిరేకిస్తామని స్పష్టం చేశారు.




