14 August, 2026 | 2:30 AM

చేయూత దక్కేనా?

14-08-2026 12:28 AM
  1. తొలుత జూన్ 2.. ఇప్పుడు ఆగస్టు 15 
  2. కొత్త పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటనలు 
  3. ఆన్‌లైన్‌కు సమయం పట్టే అవకాశం
  4. సాయం కోసం ఎదురుచూస్తున్న అభాగ్యులు

కరీంనగర్, ఆగస్టు 13 (విజయ క్రాంతి): చేయూత పింఛన్ల జారీ మరో సారి అలస్యమయ్యే అవకాశం ఉంది. తొలుత రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని జూన్ 2న ఇస్తామని ప్రకటించారు. తరువాత స్వతంత్ర దినోచ్ఛవ రోజున ఇవ్వాలనుకున్న కొద్దిమందికి మాత్రమే ఇవ్వ నున్నా రు. ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తుల ను చేయూత పోర్టల్ లో నమోదు చేచే ప్రక్రియ పూర్తి కాక పొగ ఆన్ లైన్ లో కొత్త దరఖాస్తులు వచ్చి చేరుతున్నాయి. 

ఉమ్మడి కరీంనగర్ లో 3 లక్షల మంది పింఛన్ దారులు ఉన్నారు. కొత్తగా 2 లక్షల మం ది వరకు దరఖాస్తు చేసుకున్నారు. తరచు వాయిదా పడుతుండటంతో అర్హులలో ఆందోళన మొదలయింది. అర్హులైన పేద లకు చేయూత పింఛన్లు అందించేందు కు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో అర్హులైన ఏ ఒక్క రూ మిస్ కాకుండా చర్యలు తీసుకోవాలని ఆయా జిల్లా కలెక్టర్లు ఆదేశాలు జారీ చేశారు.

కొత్తగా పింఛన్లకు అర్హత పొందే వారిని శాచురేషన్ మోడ్ లో గుర్తించి, వారం రోజుల్లో అర్హులందరినీ గుర్తించేలా ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని సూచించారు. ప్రతి గ్రామము ప్రతి వార్డు వారిగా ఈ ప్రక్రియ యుద్ధ ప్రాతిపదికన పకడ్బందీగా చేపట్టాలని నిర్ణయించారు. తొలి దశలో వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, గీత కార్మికులు, చేనేత కార్మికులు, ఫైలేరియా బాధితులు, తలసేమియా, సికిల్ సెల్ డిసీజ్, హీమోఫీలియా వంటి రక్త సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న దివ్యాంగులకు, వృద్దులకు ప్రాధాన్యత ఇవ్వనున్న నేపథ్యంలో ఆయా వర్గాలకు చెందిన ప్రతి ఒక్కరినీ గుర్తించే పనిలో పడ్డారు.

ఒంటరి మహిళలు తమ జనన ధ్రువపత్రం, ఎస్సెస్సీ మెమో, ఓటరు గుర్తింపు కార్డు వంటి అందుబాటులో ఉన్న పత్రాలను సిద్ధంగా ఉంచు కోవలసి ఉంటుంది. కరీంనగర్, రామగుండం నగరపాలక సంస్థతోపాటు చొప్పదండి, హుజూరాబాద్, జమ్మికుంట, జగిత్యాల, మెటపల్లి, కోరుట్ల, ధర్మపురి, రాయికల్, పెద్దపల్లి, మంథని, సల్యాణబాద్, సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీ పరిధిలో ఈ ప్రక్రియను మరింత సవాలుగా తీసుకుని అర్హులైన ప్రతి ఒక్కరినీ గుర్తించాలని నిర్ణయించారు.

అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలి

అర్హుల గుర్తింపు నుంచి దరఖాస్తుల స్వీకరణ, ఆన్లైన్ డేటా నమోదు, క్షేత్రస్థాయి పరిశీలన, తుది జాబితా త యారీ వరకు ఎక్కడా తప్పిదాలు జరగకుండా అధికారు లు అప్రమత్తంగా వ్యవహరించాలి. పేదలకు ప్రభుత్వం అందిస్తున్న ఈ అవకాశాన్ని అర్హులందరికీ చేరువ చేయడమే లక్ష్యంగా పనిచేయాలి. పేదలకు న్యాయం చేయడ మే లక్ష్యంగా అధికారులు పనిచేయాలి.

 చిత్ర మిత్ర , కరీంనగర్ జిల్లా కలెక్టర్