జాతీయ పురస్కారాన్ని అందుకున్న దంపతులను సన్మానించిన చేనేత సంఘం నాయకులు
11-08-2025 08:48 PM
చండూరు/గట్టుప్పల (విజయక్రాంతి): జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఆగస్టు 7న, న్యూఢిల్లీలో 8 కోట్ల చేనేత వస్త్రాల తయారీతో పాటు, 300 మంది నేత కార్మికులకు ఉపాధి కల్పిస్తూ చేనేత వస్త్రాల మార్కెటింగ్లో జాతీయస్థాయి పురస్కారాన్ని రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్న పుట్టపాకకు చెందిన చేనేత వ్యాపారస్తులు గజం నర్మదా నరేందర్ లను సోమవారం హైదరాబాదులోని శంషాబాద్ విమానాశ్రయంలో పద్మశాలి సంఘం నాయకులు వారికి స్వాగతం పలుకుతూ శాలువాలు కప్పి, పూలబొకేలతో పాటు మెమొంటో అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. సన్మానించిన వారిలో చింత వెంకటేష్, చింత సాయి దీప్, జల్లా అంజయ్య, పున్న శీను, కొలను వెంకటేశం, కుకుడాల నరసింహ తదితరులు ఉన్నారు.






