calender_icon.png 12 August, 2025 | 12:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జాతీయ నులిపురుగుల నివారణ కార్యక్రమాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్

11-08-2025 08:47:19 PM

వరంగల్ (విజయక్రాంతి): జాతీయ నులిపురుగుల నివారణ కార్యక్రమాన్ని సోమవారం జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదా దేవి(District Collector Dr. Satya Sharada Devi) ప్రారంభించారు. వరంగల్ జిల్లా గీసుకొండ మండలం ధర్మారం హైస్కూల్లో సోమవారం జరిగిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొని పాఠశాలల విద్యార్థులందరికీ నులిపురుగుల నివారణ మందులు మింగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ప్రతి సంవత్సరం ఫిబ్రవరి, ఆగస్టు మాసాలలో పిల్లల్లో రక్తహీనతను నివారించడానికి నులిపురుగుల నివారణ దినోత్సవం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సాంబశివరావు ఆధ్వర్యంలో జరిగింది.