29-07-2025 01:50:20 AM
వనపర్తి టౌన్, జూలై 28 : వనపర్తి జిల్లాలోని చేనేత కార్మికులు 2017 ఏప్రిల్ 1 నుండి మార్చి, 31, 2024 మధ్య కాలంలో చేనేత రుణాలు పొంది బ్యాంకులకు పూర్తిగా తిరిగి చెల్లించిన కార్మికులు రుణ మాఫీ కొరకు తగిన ఆధారాలతో ఎ .డి. హ్యాండ్లూమ్ గోవిందయ్యను సంప్రదించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఏప్రిల్ 1, 2017 నుండి మార్చి 2024 మధ్య కాలంలో చేనేత రుణాలు తీసుకున్న 252 మంది కార్మికులు, తీసుకున్న రుణాలను బ్యాంకులకు తిరిగి చెల్లించిన 86 మంది కార్మికుల ruba మాఫీ కొరకు ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించడం జరిగిందని, కానీ రుణాలు పూర్తిగా చెల్లించిన కార్మిలు 86మంది కాకుండా ఇంకా ఎవరైనా ఉంటే తగిన ఆధారాలతో ఎ .డి హ్యాండ్లూమ్ గోవిందయ్య ఫోన్ నం. 95737 30056 కు సంప్రదించాలని కలెక్టర్ కోరారు.
రుణాలు చెల్లించిన ప్రతి ఒక్కరికి రుణమాఫీ జరగాలని, ఏ ఒక్కరు తప్పిపోవడానికి వీలు లేదని తెలిపారు. నిర్ణిత కాలంలో చేనేత రుణాలు పొంది రుణ మాఫీ జాబితాలో పేర్లు లేని కార్మికులు వారం రోజుల్లో ఎ .డి. హ్యాండ్లూమ్ ను సంప్రదించాలని సూచించారు. చేనేత రుణాలు పొందిన దానికి అనుగుణంగా గరిష్టంగా ఒక లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేసిన వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయడం జరుగుతుందని కలెక్టర్‌తెలిపారు.