29-07-2025 01:51:34 AM
హైదరాబాద్, జూలై 28 (విజయక్రాంతి): రాష్ట్రంలో 4 రోజుల పాటు పలు జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ మేరకు ఆగస్టు 1వ తేదీ వరకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. రాష్ట్రంలో బలమైన ఉపరితల గాలులు గంటకు 30 కి.మీ. వేగంతో వీస్తాయని ఐఎండీ వెల్లడించింది. రాబోయే 4 రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా దాదాపుగా ఇదే పరిస్థితి ఉంటుందని తెలిపింది.