1 July, 2026 | 9:20 PM

Breaking News

ప్రజల పన్నులతో నిర్మించిన 'మహాప్రస్థానం'పై..   •   లయన్స్ క్లబ్ బాన్సువాడ నూతన అధ్యక్షుడిగా పాత బాలకృష్ణ   •   ఓదెల మల్లన్న ఆలయంలో భక్తులపై తేనెటీగల దాడి   •   రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలోని ఆలయాలకు ఉత్సవాలు నిర్వహిస్తాం   •   ఘనంగా ఎల్‌హెచ్‌పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న గిరిజన నాయకులు   •   విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు   •   సందీప్ నగర్ కాలనీ సమస్యలపై కమిషనర్ స్పందన   •   పేద కుటుంబాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది   •   ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •  

స్పోర్ట్స్ సిటీగా హనుమకొండ

29-06-2024 12:05 AM
  • క్రీడాశాఖ ముఖ్య కార్యదర్శి వాణీప్రసాద్

హనుమకొండ, జూన్ 28 (విజయక్రాంతి): స్వల్ప వ్యవధిలోనే గణనీయమైన ప్రగతి సాధిస్తూ హనుమకొండ స్పోర్ట్స్ సిటీగా మారుతోందని రాష్ట్ర క్రీడలు యువజన పర్యాటకశాఖ ముఖ్య కార్యదర్శి   వాణీప్రసాద్ అన్నారు. హనుమకొండజవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలతోపాటు క్రీడా పాఠశాల ఎంపికలను శుక్రవారం పర్యవేక్షించారు. సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్‌ను పరిశీలించారు. మున్సిపల్ కార్పొరేషన్ సహకారంతో ట్రాక్ మధ్యలో నూతనంగా రెజ్లింగ్ హాల్ నిర్మిస్తుండటంపై హర్షం వ్యక్తంచేశారు.

శిథిలావస్థలో ఉన్న బాలికల వసతి గృహాన్ని పరిశీలించి, కొత్త భవన నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని డీవైఎస్‌వో అశోక్‌కు సూచించారు. అనంతరం స్టేడియంలో నిర్వహిస్తున్న క్రీడా పాఠశాల ఎంపికకు సంబంధించి 800 మీట ర్ల పరుగు పందెంను జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో టూరిజంశాఖ మేనేజింగ్ డైరెక్టర్ ప్రకాశ్‌రెడ్డి, స్కిల్ డెవలప్‌మెంట్ ట్రైనింగ్ సెంటర్ సూపరింటెండెంట్ మహ్మద్ నయీమ్, జిల్లా ఒలింపిక్, ఖోఖో అసోషియేన్ల ప్రధాన కార్శదర్శులు కైలాసంయాదవ్, శ్యాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.