14 April, 2026 | 1:58 PM

మంత్రి పొంగులేటి స్వగ్రామంలో ఆధ్యాత్మిక ప్రభ

14-04-2026 11:16 AM

హనుమాన్ నామస్మరణతో పులకించిన మంత్రి పొంగులేటి నివాసం

హాజరైన పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ప్రసాద్ రెడ్డి దంపతులు

కల్లూరు,(విజయక్రాంతి): భక్తిశ్రద్ధలు... ఆధ్యాత్మిక పరిమళాల మధ్య కల్లూరు మండలం(Kalluru Mandal) నారాయణపురం గ్రామం పులకించిపోయింది. తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి( Minister Ponguleti Srinivas Reddy ) స్వగృహంలో  హనుమాన్ చాలీసా పారాయణ ఘట్టం(Hanuman Chalisa Parayanam) అత్యంత వైభవంగా ఆధ్యాత్మిక చైతన్యాన్ని నింపుతూ సాగింది. మంగళవారం నాటి పవిత్ర ఘడియల్లో ఆంజనేయ స్వామి స్తోత్ర పారాయణంతో మంత్రి నివాసం ఆధ్యాత్మిక వేదికను తలపించింది.

కుటుంబ సమేతంగా ఆధ్యాత్మిక ఆరాధన...

ఈ పవిత్ర కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఆయన సతీమణి పొంగులేటి మాధురి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రి  మాతృమూర్తి పొంగులేటి స్వరాజ్యం సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో సోదరుడు పొంగులేటి ప్రసాద్ రెడ్డి ఆయన సతీమణి శ్రీలక్ష్మి రెడ్డి దంపతులు భక్తితో పారాయణం చేశారు. కుటుంబ సభ్యులందరూ ఏకమై సామూహికంగా హనుమాన్ చాలీసా పఠిస్తుంటే ఆ ప్రాంతమంతా భక్తి పారవశ్యంలో మునిగిపోయింది.

శుభం భూయాత్ - రాష్ట్ర ప్రజల సంక్షేమం కోరుతూ.. కేవలం ఆధ్యాత్మిక సాధనకే కాకుండా, లోక కళ్యాణార్థం, రాష్ట్ర ప్రజలందరి క్షేమం కోరుతూ ఈ పారాయణాన్ని నిర్వహించారు. "రామదూత" ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఈ సందర్భంగా ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు స్వామివారి కృపకు పాత్రులయ్యారు.