ఎర్రుపాలెంలో హనుమాన్ జయంతి
13-05-2026 01:23 AM
ఎర్రుపాలెం మే 12 (విజయక్రాంతి): ఎర్రుపాలెం మండలంలో మంగళవారం నాడు హనుమాన్ జయంతి వేడుకలను గ్రామ గ్రామాన ఘనంగా నిర్వహించారు. మండలంలోని వివిధ హనుమాన్ దేవాలయాలు శ్రీరాముని దేవాలయాల నందు హనుమాన్ దేవతా మూర్తిని ప్రత్యేకంగా పూలమాలతో అలంకరించారు.
ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు. మండల కేంద్రమైన ఎర్రుపాలెం శ్రీ బాల త్రిపుర సుందరి సమేత చంద్రమౌళీశ్వర స్వామి దేవస్థానం నందు ఉన్న శ్రీ ఆంజనేయ స్వామికి ప్రత్యేక అలంకరణలు పూలమాలలతో ఆలయ అర్చకులు నూరి గోపాల కృష్ణ శర్మ ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. భక్తులు హనుమాన్ చాలీసాను పఠించారు. తనంతరము భక్తులకు తీర్థ ప్రసాదములు అందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ మగినం జయశ్రీ పాల్గొన్నారు.






