13 May, 2026 | 2:23 AM

ఇల్లెందులపాడులో హనుమాన్ జయంతి

13-05-2026 01:20 AM

మధిర, మే 12 (విజయక్రాంతి): మధిర మున్సిపాలిటీ ఇల్లెందులపాడులో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మంగళవారం వార్డులోని అభయ ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. అభిషేక కార్యక్రమంలో బోడెపుడి గోపీనాథ్ దంపతులు, అత్తిమల్ల వెంకటేశ్వరరావు దంపతులు పాల్గొన్నారు.

అనంతరం భక్తులకు మేడ గోపీనాథ్ విజయలక్ష్మి దంపతుల కుమారుడు మేడ సాయిచాంద్ ఆర్థిక సహాయంతో అన్నదాన కార్యక్రమాన్ని మధిర మున్సిపాలిటీ చైర్పర్సన్ సామినేని సుజాత రామనాథంలు ప్రారంభించారు. అనంతరం చైర్ పర్సన్ మాట్లాడుతూ.... హనుమాన్ జయంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మెడ గోపీనాథ్ కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు వాసిరెడ్డి నాగేశ్వరరావు, వాసిరెడ్డి ప్రసాద్, చావా శివాజీ, సూర్యదేవర కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.