calender_icon.png 23 May, 2025 | 9:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా హనుమాన్ జయంతి

23-05-2025 12:00:00 AM

  1. భక్తులకు అన్నదానం
  2. హాజరైన ఎమ్మెల్యే ముఠా గోపాల్, కార్పొరేటర్ ఏ.పావని వినయ్ కుమార్

ముషీరాబాద్, మే 22 (విజయకాంతి): ముషీరాబాద్ నియోజకవర్గంలోని ఆయా డివిజన్‌లలో గురువారం హనుమాన్ జయంతి వేడుకలను ఆయా దేవాలయాలలో  నిర్వాహకులు ఘనంగా జరుపుకున్నా రు.

ముషీరాబాద్ నియోజకవర్గం లోని  గాంధీనగర్ డివిజన్ వివేక్ నగర్ హనుమాన్ దేవాలయం,  కవాడిగూడ డివిజన్ లోని బండ మైసమ్మ నగర్ హనుమాన్ దేవాలయంలో ఎమ్మెల్యే ముఠా గోపాల్ హాజరై  ప్రత్యేక పూజలు నిర్వహించి తమ మొక్కలు తీర్చుకున్నారు. అనంతరం ఆల య నిర్వాహకులు భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు.

కార్యక్రమంలో  బిఆర్ ఎస్ యువ నాయకులు ముఠా జై సింహ, వివేక్ నగర్ హనుమాన్ టెంపుల్ ఈవో దేవనాదం, ఆలయ చైర్మన్ జానకి సుధాకర్, గాంధీనగర్ డివిజన్ ప్రెసిడెంట్ రాకేష్ కుమార్, కవాడిగూడ డివిజన్ ప్రెసిడెంట్ వల్లాల శ్యామ్ యాదవ్, రాంనగర్ డివిజన్ ప్రెసిడెంట్ శంకర్ ముదిరాజ్, కార్యదర్శి శ్రీకాంత్, బిఆర్‌ఎస్ సీనియర్ నాయకులు, ఆకుల శ్రీనివాస్, పూన్న సత్యనారాయణ, మీడియా ఇంచార్జ్ ముచ్చ కుర్తి ప్రభాకర్, సంతోష్, వల్లాల శ్రీనివాస్ యాదవ్, సుధాకర్ గుప్తా,శ్రీహరి, మోజెస్, రాజేష్, రాజశేఖర్ గౌడ్, దుర్గా స్వామి, రవి యాదవ్, ముచ్చ కుర్తి పద్మ, శ్రీధర్ రెడ్డి, రాములు, శ్రీకాంత్, లవ్ కుమార్, ప్రతాప్ గౌడ్, మేకల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

గాంధీనగర్‌లో ..

హనుమాన్ జయంతి ఉత్సవాలను గాంధీనగర్ డివిజన్‌లో గురువారం ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్, చిక్కడపల్లి వివేక్ నగర్ శ్రీ ఆంజనేయస్వామి ఆలయం, ఆర్ టీ సి క్రోస్ రోడ్స్ లోని శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయం, శ్రీ హనుమాన్ దేవా లయం, వీవీ గిరినగర్‌లోనీ శ్రీ వీరాంజనేయ స్వామి  దేవాలయాలలో ప్రత్యే క పూజలు నిర్వహించారు.

దేవాలయాల ఈ ఓ లు, చెర్మెన్ లు కార్పొరేటర్ కు అర్చకుల ద్వారా స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. వేడుకల్లో బీజేపీ సికింద్రాబాద్ పార్ల మెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమా ర్, బీజేపీ సీనియర్ నాయకులు రత్న సాయి చంద్, శ్రీకాంత్, పి. నర్సింగ్ రావు, సత్తి రెడ్డి, ఆకుల సురేందర్, శివకుమార్, ఆనంద్ రావు, రఘు యాదవ్, నీరజ్ పాల్గొన్నారు.