calender_icon.png 23 May, 2025 | 7:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిజాం క్యాంపస్‌లో మోహరిచిన పోలీసులు వెళ్లిపోవాలి

23-05-2025 12:00:00 AM

  1. విద్యార్థులపై యాజమాన్యం కక్షపూరిత చర్యను మానుకోవాలి 
  2. నిలిపివేసిన విద్యార్థుల హాల్ టికెట్లను వెంటనే విడుదల చేయాలి 
  3. నిజాం స్టూడెంట్స్ యూనియన్ ఐక్యవేదిక

ఖైరతాబాద్; మే 22 (విజయ క్రాంతి) : నిజాం కళాశాల క్యాంపస్ లో మోహరించిన పోలీసు బలగాలు వెంటనే క్యాంపస్ ని వదిలి వెళ్ళిపోవాలని నిజాం కళాశాల స్టూ డెంట్స్ యూనియన్ ఐక్యవేదిక డిమాండ్ చేసింది. ఈ మేరకు గురువారం క్యాంపస్ లో ఐక్యవేదిక ఆధ్వర్యంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

ఈ సమావేశంలో ఐక్యవేదిక సభ్యులు సాయి ప్రసాద్, రాకేష్, మోక్షిత్, స్టాలిన్, రామకృష్ణ, సత్యంలు మాట్లాడారు.. నిజం కళాశాల యాజమా న్యం విద్యార్థుల నుంచి పరీక్ష ఫీజులను వసూలు చేసి దాదాపు 300కు పైగా విద్యార్థులను హాజరు శాతం సరిగా లేదు అన్న నెపంతో వారికి హాల్ టికెట్లు జారీ చేయకపోవడం ఎంతవరకు సమంజసం అని అన్నారు.

విద్యార్థులు ఇట్టి విషయాన్ని ప్రశ్నిస్తూ శాంతియుత నిరసన తెలుపుతుండడంతో భద్రత చర్యల పేరిట యాజమా న్యం పోలీసు బలగాలను  మొహరించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఇది విద్యార్థుల మధ్య భయాన్ని, ఆందోళనను పెంచుతుందని తెలిపారు. ప్రిన్సిపల్ వ్యక్తిగత భద్రత కోసమే పోలీసులను మోహరించడం జరిగిందని ఆరోపించారు.

దీనిని విద్యార్థి సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయని తెలిపారు. వెంటనే యాజమాన్యం స్పందించి పోలీసు బలగాలను వెనక్కి పంపియడంతో పాటు నిలిపివేసిన విద్యార్థుల హాల్ టికెట్లను విడుదల చేసి వారిని పరీక్షలు రాసే విధంగా కన్సిడర్ చేయాలని అన్నారు. లేనిపక్షంలో  విద్యార్థులకు ఫీజులను తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు.