హనుమంతుడిని ఆదర్శంగా తీసుకోవాలి
22-04-2024 12:26 AM
l ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి
కామారెడ్డి, ఏప్రిల్ 21 (విజయక్రాంతి) : హనుమంతుడిని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకొని సన్మార్గంలో నడవాలని బాన్సువా డ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నా రు. బాన్సువాడలోని తాడ్కోల్ డబుల్ బెడ్ రూం కాలనీలో నూతనంగా నిర్మించిన హనుమాన్ ఆలయంలో ఆదివారం నిర్వహించిన విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో ఆయన పాల్గొని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. హనుమంతుడు గురుభక్తికి నిదర్శనమన్నారు. భక్తితోనే ముక్తి లభిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ ఇన్‌చార్జ్, డీసీసీబీ మాజీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ గంగాధర్, భక్తులు పాల్గొన్నారు.






