క్రికెట్ ఆడుతున్నారట..
రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబోలో ఓ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ‘ఆర్‌సీ 16’గా రూపొం దుతున్న ఈ చిత్రం బౌండ్ స్క్రిప్ట్‌తో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించారు. ఈ షూటింగ్‌కి సంబంధించిన షూటింగ్ మైసూర్‌లో ప్రారంభమైన విషయం తెలిసిందే. తొలి షెడ్యూల్‌లో రామ్ చరణ్ పాల్గొన్నారు. ఇది ఇటీవల పూర్తుంది. తాజాగా సెకండ్ హెడ్యూల్ హైద రాబాద్‌లో ప్రారంభమైంది.
హైదరాబాద్‌లోని ఓ బూత్ బంగ్లాలో ఈ షూటింగ్ జరుగుతోందని తెలుస్తోంది. ఈ షెడ్యూల్ గురించి ఓ ఆసక్తికర వార్త వైరల్ అవుతోంది. ఈ షెడ్యూల్‌లో క్రికెట్ మ్యాచ్ ఎపిసోడ్ చిత్రీకరిస్తున్నారని సమాచారం. కన్నడ ప్రముఖ నటుడు శివరాజ్ కుమార్ విలన్‌గా నటిస్తున్నారు. ‘గేమ్ చేంజర్’ ప్రి రిలీజ్ ఈవెంట్ కోసం రామ్ చరణ్ అమెరికా వెళ్లనున్నారు కాబట్టి ఈ నెల 20 లోపు సెకండ్ షెడ్యూల్‌ను పూర్తి చేస్తారని సమాచారం.






