calender_icon.png 14 June, 2025 | 10:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా డీసీసీ చీఫ్ కవ్వంపల్లి పుట్టినరోజు వేడులు

11-06-2025 12:50:02 AM

కొత్తపల్లి, జూన్ 10 (విజయ క్రాంతి): కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ జన్మదిన మంగళవారం జిల్లావ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ఎస్సీ సెల్ నాయకులు అస్తపురం రమేష్ గారి ఆధ్వర్యంలో శాతవాహన యూనివర్సిటీ వద్ద, జిల్లా కాంగ్రెస్ ఎస్టి సెల్ ఆధ్వర్యంలో చింతకుంట శాంతినగర్ స్టేజి వద్ద కేక్ కటింగ్ చేశారు.

జిల్లా మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు వెన్నం రజిత రెడ్డి ఆధ్వర్యంలో మార్కెట్ రోడ్డు లోని వెంకటేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షులు కొరివి అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో కోర్టు చౌరస్తాలో, నగర కాంగ్రెస్ అధికార ప్రతినిధి బాలబద్రి శంకర్ గారి ఆధ్వర్యంలో రేకుర్తి కంటి ఆసుపత్రి, ఎస్.సి.సెల్ కాంగ్రెస్ నేత తంగేళ్ల కిరణ్ ఆధ్వర్యంలో స్థానిక మాతా శిశు ఆసుపత్రిలో,

జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ కన్వీనర్ జీడి రమేష్ గారి ఆధ్వర్యంలో కార్ఖానా గడ్డ వృద్ధాశ్రమంలో, డిసిసి మైనార్టీ సెల్ అధ్యక్షులు ఎండి తాజ్, మైనారిటీ నాయకులు లయీక్ ఆధ్వర్యంలో, ఇందిరా చౌక్ వద్ద నగర కాంగ్రెస్ అధ్యక్షులు, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం, ఆల్ ఫోర్ సంస్థల చైర్మన్ ఎమ్మెల్సీ అభ్యర్థి వి నరేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులుపాల్గొన్నారు.