14-01-2026 01:39:19 AM
‘బలగం’ సినిమాతో దర్శకుడిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు వేణు యెల్దండి. ఇప్పుడు తన తర్వాతి ప్రాజెక్టును ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే తన నెక్స్ చిత్రం ప్రముఖ నిర్మాత దిల్ రాజు బ్యానర్ శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్‌లో ఉండబోతుందని ఆయన వెల్లడించారు. ఈ సినిమాను అధికారికంగా ప్రకటించేందుకు డేట్, టైమ్ ఫిక్స్ చేశారు.
ఈ సినిమాకు సంబంధించిన అనౌన్స్‌మెంట్ గ్లింప్స్ సంక్రాంతి కానుకగా జనవరి 15న సాయంత్రం 4.05 గంటలకు విడుదల చేస్తున్నట్టు దర్శకుడు వేణు తాజాగా వెల్లడించారు. ఈ మేరకు ఓ వీడియోను రిలీజ్ చేశారు. ఈ సినిమాకు ‘ఎల్లమ్మ’ అనే టైటిల్ ఉండబోతు న్నట్లు దర్శకుడు వేణు, నిర్మాత దిల్ రాజు పలు వేదికలపై ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాతో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ హీరోగా పరిచయం కాబోతున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో కీర్తి సురేశ్ హీరోయిన్‌గా నటించనుంది.