1 May, 2026 | 7:23 PM

Breaking News

చిరంజీవి సెట్ చేసిన ఎనర్జీని అనగనగా ఒక రాజు కొనసాగిస్తాడు

13-01-2026 01:44 AM

నవీన్ పొలిశెట్టి కథానాయకుడిగా నటించిన చిత్రం ‘అనగనగా ఒక రాజు’. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. నూతన దర్శకుడు మారి తెరకెక్కించిన ఈ సినిమాలో మీనాక్షి చౌదరి కథానాయిక. ఈ చిత్రం సంక్రాంతి సందర్భంగా జనవరి 14న థియేటర్లలో అడుగు పెడుతోంది. సోమవారం సాయంత్రం హనుమకొండలోని కాకతీయ ప్రభుత్వ కళాశాలలో ఈ మూవీ ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించారు. ఈ చిత్రంలోని ‘ఆంధ్ర టు తెలంగాణ’ అనే పాటను ఈ వేదికపై ఆవిష్కరించారు. మంత్రి సీతక్క కొడుకు ధనసరి సూర్య, ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి, పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు అతిథులుగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా హీరో నవీన్ పొలిశెట్టి మాట్లాడుతూ.. “ఆలస్య మైనా మంచి సినిమా అందించాలనేదే మా ప్రయ త్నం. మా టీమ్‌తో సంబంధం లేనివారికి ఈ సినిమా చూపించాం. కడుపుబ్బా నవ్వుతూనే ఉన్నారు. భావోద్వేగ సన్నివేశాలు చూసి నిల్చొని చప్పట్లు కొట్టారు. అందమైన ఎమోషనల్ డ్రామా కూడా ఇందులో ఉంటుంది. ఆ ఎమోషనల్ సీన్స్ చూస్తూ మా టీమ్ అంతా కంటతడి పెట్టుకున్నాం. మీరు జనవరి 14న థియేటర్‌కి రండి.. పండగ సినిమా అందించే బాధ్యత మాది. నాకు ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ లేకపోయినా.. నాకు బ్యాక్‌గ్రౌండ్‌గా ఎన్నో ఫ్యామిలీలున్నాయి. చివరి శ్వాస వరకు ఎంటర్‌టైన్ చేయడానికి ప్రయత్నిస్తా. మా గురువు చిరంజీవి పండగకు థియేటర్లలో ఒక ఎనర్జీని సెట్ చేసేశారు.

‘అనగ నగా ఒక రాజు’తో మేము ఆ ఎనర్జీని కొనసాగించబోతున్నాం” అన్నారు. కథానాయిక మీనాక్షి చౌదరి మాట్లాడుతూ.. “ఈ రోజు నా ఆరోగ్యం కొంచెం బాలేకున్నా మిమ్మల్ని కలవాలని ఇక్కడికి వచ్చాను. గత సంక్రాంతికి నేను చేసిన ‘మీను’ పాత్రను మీరు ఎంతో ప్రేమించారు. ఈ సంక్రాంతికి మీరు ‘చారులత’ పాత్రపై ప్రేమను కురిపిస్తారని ఆశిస్తున్నా” అని తెలిపింది. త్ర దర్శకుడు మారి మాట్లాడుతూ.. ‘పర్ఫెక్ట్ ఫెస్టివల్ ఎంటర్‌టైనర్ ఇది. మీరు ఒకసారి థియేటర్లోకి వెళ్లిన తర్వాత మీ బాధలన్నీ మర్చిపోయి రెండు గంటల పాటు మనస్ఫూర్తిగా నవ్వుకుంటారు” అని చెప్పారు.