calender_icon.png 26 November, 2025 | 9:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా రాజ్యాంగ దినోత్సవం

26-11-2025 09:02:08 PM

జై భీమ్ కన్వీనర్ తాళ్లపల్లి విజయ్..

హనుమకొండ టౌన్ (విజయక్రాంతి): హనుమకొండ వడ్డేపల్లి చర్చి జంక్షన్ లో జై భీమ్ కార్యాలయంలో తాళ్లపల్లి విజయ్ ఆధ్వర్యంలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రపంచ దేశాలకు మన భారత రాజ్యాంగం దిక్సూచి లాంటిదని అన్నారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆర్నిశలు కష్టపడి ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొని దేశంలో ప్రతి ఒక్కరికి సమాన హక్కులు కల్పించాలని, దేశ ప్రజలందరికీ న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం,హక్కులు, విధులు అనేక అంశాలతో కూడిన గ్రంథమే మన భారత రాజ్యాంగం అని అన్నారు.

మన రాజ్యాంగ దినోత్సవాన్ని ప్రజలందరూ, విద్యాలయాలలో ఒక పండుగ గల జరుపుకునే విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి, రాజ్యాంగ పీఠికను ప్రతి ఒక్క పౌరునికి అందే విధంగా సహకరించాలని, అన్ని కుల , మతా, వర్ణ ,వర్గాల, అందరూ సమానమని చాటి చెప్పిన గ్రంథమే మన రాజ్యాంగమని, మనువాద సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు అందరూ  సమానమే అని చాటి చెప్పిన గ్రంథం మన భారత రాజ్యాంగం అని అన్నారు. ఈ కార్యక్రమంలో జై భీమ్ జిల్లా సభ్యులు  ఇల్లందుల భాస్కర్, వడ్డేపల్లి యూత్ ప్రెసిడెంట్. టి ప్రసన్న, బిజెపి ఎస్సీ సెల్ జిల్లా కార్యదర్శి నల్ల రమేష్, జిల్లా కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు శనిగారపు అనిత, టీ. ప్రశాంత్, రాజు, దుప్పటి కోటి, ప్రదీప్, ప్రభు  రూపస్ తదితరులు పాల్గొన్నారు.