calender_icon.png 26 November, 2025 | 9:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భారత రాజ్యాంగం యొక్క ఆవశ్యకతను తెలుసుకోవాలి

26-11-2025 09:00:19 PM

జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎం. రాజేందర్ 

భద్రాద్రి కొత్తగూడెం, (విజయక్రాంతి): రాజ్యాంగ దినోత్సవం సందర్భంగ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, కొత్తగూడెం ఆధ్వర్యంలో కూలీ లైన్, కొత్తగూడెంలో న్యాయ చైతన్య కార్యక్రమంను బుధవారం ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగ జిల్లా న్యాయ సేవాధికార  సంస్థ కార్యదర్శి ఎం. రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగ ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగం అందించిన హక్కులు, ఉచిత న్యాయ సేవలను సద్వినియోగం చేసుకోవాలని  పిలుపునిచ్చారు. న్యాయ సహాయం ప్రతి ఒక్కరి హక్కు అని తెలిపారు.

రాజ్యాంగంలోని అధికరణం 39(A) ప్రకారం పేదరికంతో లేదా ఇతర కారణం వల్ల ఏ ఒక్క పౌరుడు న్యాయం పొందకుండా ఉండకూడదని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఉచిత న్యాయ సహాయంను పొందచ్చని అందుకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థను సంప్రదించాలని తెలిపారు. బాల్య వివాహాలు చట్టరిత్య నేరమని వాటిని రూపుమాపెందుకు అంగన్వాడి కార్యకర్తలు ఆశా కార్యకర్తలు, కాలనీ, గ్రామ పెద్దలు కృషి చేయాలనీ తెలిపారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ జుడీషియల్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ మెండు రాజమల్లు, కొత్తగూడెం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్కినేని సత్యనారాయణ, వైస్ ప్రెసిడెంట్ గోపికృష్ణ, రఘురామాచారి, సఖి అడ్మిన్ సుబశ్రీ, పారా లీగల్ వాలంటీర్స్ రాజమణి, భారతి, భాగ్యలక్ష్మి, జ్యోతి మహిళలు గ్రామ పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.