8 June, 2026 | 12:40 AM

అభిమానులకు నయనాందం

09-10-2024 12:00 AM

స్టార్ హీరోయిన్ నయనతార వివాహం 2022 జూన్‌లో జరిగిన విషయం తెలిసిందే. ప్రముఖ దర్శకుడు విఘ్నేశ్ శివన్‌ను ఆమె వివాహం చేసుకున్నారు. వీరికి 2022 అక్టోబర్‌లో సరోగసీ ద్వారా కవలలను పొందారు. అయితే నయన్ అభిమానులకు ఆమె వివాహాన్ని చూసే అదృష్టం లేకుండా పోయిందన్న చింత ఇన్నాళ్లకు తీరబోతోంది.

నయన్ వివాహ డాక్యుమెంటరీ హక్కులను ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేసింది. దీంతో త్వరలోనే నయన్ వివాహ వీడియో ఓటీటీలో విడుదల కానుంది. 80 నిమిషాల నిడివితో ఈ వీడియో ఉంటుంది. ప్రస్తుతం నయన్ ఫ్యామిలీ డ్రామాగా రూపొందుతున్న ప్రాజెక్ట్ నటిస్తున్నారు.