రాష్ట్ర ప్రజలకు హోలీ పండుగ శుభాకాంక్షలు
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
హైదరాబాద్, మార్చి 13 (విజయక్రాంతి) : రాష్ట ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ రంగుల పండును అందరూ ఆనందంగా జరుపుకోవాలని, కుల, మతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు జరుపుకొనే ఈ పండుగ సమైక్యతకు అద్దం పడుతుందని సీఎం అభిప్రాయ పడ్డారు. అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని భరోసా ఇచ్చారు.
ఈ హోలీ పండుగ అందరి కుటుంబాల్లో అనందోత్సాహాలు నింపాలని ఆకాంక్షించారు. జీవితంలో ప్రతి క్షణం హోలీ పండగలా రంగుల సమ్మేళనం గా మారాలని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ప్రజలకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు.
హోలీ పండుగ ఐక్యతకు ప్రతీక అని పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్ పేర్కొన్నారు. వసంత శోభ వెల్లివిరిసే హోలీ కేలీ పండగ ప్రజల జీవితాల్లో నిత్య వసంతాలు తీసుకురావాలని తెలిపారు.






