calender_icon.png 3 June, 2025 | 7:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజలు, పాఠకులు, ప్రకటనకర్తలకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు

02-06-2025 02:26:21 AM

భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటులో భాగంగా 1956లో తెలంగాణ ప్రాంతాన్ని కలిపి ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ఏర్పాటైన నాటినుంచి మొదలైన ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం 1969 నాటికి ఉవ్వెత్తున ఎగసిపడింది. తర్వాతి తరాల్లోనూ ఉద్యమస్ఫూర్తిని నింపింది. 2009లో కేంద్రం నుంచి తెలంగాణ ప్రకటన వెలువడి నప్పటికీ కొన్ని కుట్రల కారణంగా ఆ కల సాకారం కాలేదు. అయినా వెరవకుండా ఉద్యమకారులు, విద్యా ర్థులు ఉద్యమాన్ని కొనసాగించారు.

ఎన్నో అవరోధాలు, అవాంతరాలను ఎదుర్కొన్నారు. 1,200 మంది అమరుల త్యాగంతోపాటు సబ్బండవర్గాల పోరాట ఫలితంగా చివరకు స్వరాష్ట్ర కల సాకారమైంది. 2014 జూన్ 2న తెలంగాణ ఆవిర్భవించింది. రాష్ట్రం 12వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ప్రజలు, పాఠకులు, ప్రకటనకర్తలకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు.

 సీఎల్ రాజం, చైర్మన్