12 August, 2026 | 8:30 PM

ఘట్ కేసర్ లో హర్ ఘర్ తిరంగా ర్యాలీ

12-08-2026 07:20 PM

ఘట్ కేసర్,(విజయక్రాంతి): దేశ ప్రధాని నరేంద్రమోదీ, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రాంచందర్ రావు, జిల్లా పార్టీ ఆదేశాల మేరకు, హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ఘట్కేసర్ బస్టాండ్ నుండి శివారెడ్డిగూడ హనుమాన్ టెంపుల్ వరకు బిజెపి నాయకులు బుధవారం ర్యాలీ నిర్వహించారు. దేశభక్తి నినాదాలతో, జాతీయ జెండాలతో ఘట్కేసర్ వీధుల్లో ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది.

ఈ కార్యక్రమంలో ఘట్కేసర్ బిజెపి అధ్యక్షులు కొమ్మిడి మహిపాల్ రెడ్డి, జిల్లా కార్యదర్శి, ఘట్కేసర్ ఇన్‌చార్జ్ జైపాల్ రెడ్డి, జిల్లా కార్యదర్శి వి. హనుమాన్, హర్ ఘర్ తిరంగా జిల్లా కన్వీనర్ బోడ శ్రీనివాస్, డివిజన్ ప్రధాన కార్యదర్శి చెల్లక శ్రీధర్, మంగు రాధిక, కార్యదర్శి సిద్దిరాజు, సీనియర్ నాయకులు రామోజీ, పల్లె మధు, యువమోర్చా అనిల్ గౌడ్, కో-కన్వినర్ సురేందర్ యాదవ్, అలాగే బూత్ అధ్యక్షులు మాధవి, మమత శర్మ, శరత్, కిరణ్ కుమార్, చంద్రకాంత్, చలపతి రావు, దీపక్ వ్యాస్, సీనియర్ నాయకులు హరగోపాల్, యువమోర్చ భరత్ యాదవ్, అశోక్, రుషి, అభియాదవ్, శ్రీ చైతన్య జూనియర్ కళాశాల విద్యార్థులు, యువత, బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని ర్యాలీని విజయవంతం చేశారు.