4 June, 2026 | 2:06 PM

ఆసిఫాబాద్ బస్టాండ్‌లో ప్రయాణికులకు వేధింపులు

04-06-2026 01:03 PM

ట్రాన్స్‌జెండర్ల హల్‌చల్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్

ఆసిఫాబాద్(విజయక్రాంతి): ఆసిఫాబాద్ ఆర్టీసీ బస్టాండ్‌లో కొందరు ట్రాన్స్‌జెండర్లు ప్రయాణికులను డబ్బుల కోసం ఇబ్బందులకు గురిచేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బస్సుల్లో ఎక్కి ప్రయాణికుల వద్ద బలవంతంగా డబ్బులు అడుగుతూ, ఇవ్వకపోతే వాగ్వాదాలకు దిగుతున్నారని పలువురు ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రయాణికులు ప్రశ్నిస్తే అసభ్య పదజాలంతో దూషించడం, శాపనార్థాలు పెట్టడం వంటి ఘటనలు జరుగుతున్నాయని తెలిపారు.

మహిళలు, వృద్ధులు, యువతి ,యువకులు అసౌకర్యానికి గురవుతున్నారని పేర్కొన్నారు.బస్టాండ్ పరిసరాల్లో ఇటువంటి ఘటనలు తరచూ జరుగుతున్నప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. ఆర్టీసీ అధికారులు, పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.జీవనోపాధి కోసం ప్రయాణికులను భయభ్రాంతులకు గురిచేయడం, బలవంతంగా డబ్బులు డిమాండ్ చేయడం సరైంది కాదని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.