హరి హర వీరమల్లు అంచనాలకు ఏమాత్రం తగ్గదు
05-02-2025 12:13 AM
పవన్ కల్యాణ్ కథానాయకుడిగా రూపొందుతున్న ‘హరి హర వీరమల్లు’. దీనిని ఏఎం రత్నం నిర్మిస్తున్నారు. మంగళవారం తన పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించి ఆసక్తికర విషయాలను ఏఎం రత్నం వెల్లడించారు. ‘గతంలో పవన్, ఏఎం రత్నం కాంబోలో ఖుషి, బంగారం సినిమాలు రాగా.. హరి హర వీరమల్లు మూడో చిత్రం.
పవన్ నటిస్తున్న మొదటి పాన్ ఇండియా సినిమా కూడా ఇదే కావడం విశేషం. పవన్ అభిమానులతోపాటు ఈ చిత్రం ప్రేక్షక హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతుంది.
ఈ ఎపిక్ యాక్షన్ డ్రామా, పాన్ ఇండియా స్థాయిలో విడుదలై ఘన విజయం సాధిస్తుంది. ప్రేక్షకుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా, ప్రపంచస్థాయిలో గుర్తింపు పొందే గొప్ప చిత్రంగా నిలుస్తుంది’ అని ఏఎం రత్నం తెలిపారు.






