14 August, 2026 | 12:39 PM

వేలాది మందితో GRMB కార్యాలయాన్ని ముట్టడిస్తాం

14-08-2026 11:32 AM

హైదరాబాద్: అర్థసత్యాలు, అబద్ధాలు, కట్టుకథలతో చరిత్రను మార్చలేరు, వాస్తవాలను వెలుగులోకి రాకుండా రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అడ్డుకోలేరని హరీశ్ రావు(Harish Rao) స్పష్టం చేశారు. జీఆర్ఎంజీ అజెండా అంశాలను మార్చేలా సీఎం రేవంత్ రెడ్డి చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి హరీశ్ రావు కోరారు. ఏపీ ప్రతిపాదించిన తెలంగాణ వ్యతిరేక అంశాలను అజెండాలో తొలగించాలని డిమాండ్ చేశారు. అజెండా మార్చకుండా జీఆర్ఎంజీ సమావేశానికి(GRMG meeting) ప్రభుత్వం వెళ్తొదన్నారు.

అజెండా మార్చకుండా భేటీకి హాజరైతే బీఆర్ఎస్ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. వేలాది మందితో జీఆర్ఎంజీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని సూచించారు. రాష్ట్ర నీటి హక్కుల పరిరక్షణ కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధమని తెలిపారు. వ్యవసాయం, సాగునీటి రంగాలపై మీరు చూపుతున్న నిర్లక్ష్యం యావత్ తెలంగాణకు శాపంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. గోదావరి, కృష్ణా జలాల కోసం మళ్లీ ఉద్యమాలు చేసే పరిస్థితిని కల్పిస్తున్నారని పేర్కొన్నారు.