14 August, 2026 | 12:40 PM

త్రివర్ణ పతాక ర్యాలీ కార్యక్రమం

14-08-2026 11:35 AM

చౌటుప్పల్, ఆగస్టు 14(విజయక్రాంతి): చౌటుప్పల్ బస్టాండ్ నుండి ఎమ్మార్వో కార్యాలయం వరకు స్కూల్ విద్యార్థులు, కళాశాల విద్యార్థులు మరియు వివిధ పార్టీ నాయకులు, ఉపాధ్యాయులతో కలిసి త్రివర్ణ పతాక ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా చౌటుప్పల్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ జి. మన్మధ కుమార్  హాజరై విద్యార్థులతో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ జెండా పట్ల గౌరవం, దేశభక్తి, జాతీయ సమైక్యత మరియు ఐక్యతా భావాన్ని పెంపొందించేలా విద్యార్థులకు అవగాహన కల్పించారు. ర్యాలీని ఉత్సాహంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించడం జరిగింది.