14 August, 2026 | 12:46 PM

విద్యార్థుల కుటుంబానికి ఆర్థిక సాయం

14-08-2026 11:37 AM

ముస్తాబాద్,ఆగస్టు 14(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా(Rajanna Sircilla District) ముస్తాబాద్ మండలం పోతుగల్ గ్రామంలో కాటు వెంకటేష్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు.అతని కూతుళ్లు ఇద్దరు సిరిసిల్ల లోని మహాత్మ జ్యోతిబాపూలే బాలికల పాఠశాలలో చదువుతుండగా పాఠశాల ప్రిన్సిపాల్ సుస్మిత వారి కుటుంబాన్ని గురువారం పరామర్శించారు.ధైర్యంగా ఉండాలని మేము అండగా ఉంటామని తమ విద్యార్థులకు తెలిపారు.చిన్న వయసులోనే తల్లిని తండ్రిని కోల్పోయిన తమ విద్యార్థులను చూసి చలించిపోయారు.సహచర ఉపాధ్యాయ బృందం తమ వంతు సహాయంగా15 వేలు నగదు ఆర్థిక సాయంగా అందజేసి ఓదార్చారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ కోల కృష్ణగౌడ్,వార్డు సభ్యుడు జంగ రాజు,గీస శంకర్, చీకోటి మహేష్,బిక్షపతి,నీరటి బాలయ్య,గీస శ్రీనివాస్,నర్సింలు తదితరులు పాల్గొన్నారు.