30 April, 2026 | 1:57 AM

గ్రామ దేవతల ఉత్సవాలకు హరీష్‌రావుకి ఆహ్వానం

30-04-2026 12:40 AM

జగదేవపూర్, ఏప్రిల్ 29: జగదేవపూర్  మండల పరిధిలోని పలుగడ్డ గ్రామంలో  గ్రామ దేవతలు పోచమ్మ, పెద్దమ్మ, బొడ్రాయి ప్రతిష్ట మే 4 తేదీన ఉత్సవాలకు రావాలని మాజీ మంత్రి హరీష్ రావుకు మాజీ ఆత్మ కమిటీ చైర్మన్ గుండా రంగా రెడ్డి,తాజా మాజీ సర్పంచ్ శ్రీపతి రాజేశ్వరి రవి ఆధ్వర్యంలో గ్రామ పెద్దలు మర్యాద పూర్వకంగా కలిసి ఆహ్వానం  అందచేసారు. హరీష్ రావు సైతం తప్ప కుండా వస్తా అని గ్రామస్థులకు హామీ ఇచ్చారన్నారు.కలిసిన వారిలో గ్రామ పెద్ద మనిషి నర్రా ఇస్తారీ, లింగాల రాంచంద్రం,ఉప సర్పంచ్ కళ్యాణి రాజ్ కుమార్, లింగాల కనుకయ్య,ముదిరాజ్ సంఘం అధ్యక్షులు ఎల్లేష్,పెద్ద కనుకయ్య,కరుణాకర్, కృష్ణ,నర్సింలు తదితరులు పాల్గొన్నారు.