calender_icon.png 5 February, 2026 | 2:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేసీఆర్ చేతిలోనే తెలంగాణ పదిలం

05-02-2026 12:27:45 PM

  1. కేసీఆర్ ఉంటే ఇన్ని కష్టాలు ఉండేవా?
  2. గజ్వేల్ బాగుపడాలంటే కారు గెలవాలి
  3. బీజేపీ వాళ్లు రాష్ట్రానికి ఏమైనా చేశారా?
  4. రెండేళ్ల తర్వాత కేసీఆర్ సీఎం

హైదరాబాద్: గజ్వేల్ నియోజకవర్గంలో(Gajwel Municipal Election campaign) మాజీ మంత్రి హరీశ్ రావు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని కోరారు. కేసీఆర్  చేతిలో తెలంగాణ పదిలంగా ఉండేదని సూచించారు. రేవంత్ రెడ్డి వచ్చాక రాష్ట్రంలో భూముల ధరలు పడిపోయాయని హరీశ్ రావు(Harish Rao) ఆరోపించారు.

కేసీఆర్ సీఎంగా(Kalvakuntla Chandrashekar Rao) ఉంటే ఇన్ని కష్టాలు ఉండేవా? అని ప్రశ్నించారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపిస్తే రెండేళ్లే ఉంటారని తెలిపారు. రెండేళ్ల తర్వాత కేసీఆర్ సీఎం అవుతారని హరీశ్ ధీమా వ్యక్తం చేశారు. మళ్లీ పాతరోజులు రావాలంటే కారు గుర్తు గెలవాలన్నారు. బీజేపీ వాళ్లు రాష్ట్రానికి ఏమైనా చేశారా? కేసీఆర్ రాష్ట్రంలో చాలా ఆలయాలను కట్టించారు.. గజ్వేల్ బాగుపడాలంటే కారు గెలవాలని సూచించారు. కేసీఆర్ ను గెలిపించి ఉంటే ఇప్పటికే రూ. 4 వేల పింఛన్ వచ్చేందని తెలిపారు.

కేసీఆర్ జాతిపిత ఎట్లా అవుతారని రేవంత్ రెడ్డి అంటున్నారు. కేసీఆర్ లేకుంటే తెలంగాణ వచ్చేనా? అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డికి తిట్టడం తప్ప మరేమీ రాదని మండిపడ్డారు. రెండున్నరేళ్లలో గజ్వేల్ లో కాంగ్రెస్ తట్ట మట్టి ఎత్తలేదన్నారు. ఎన్నికల తర్వాత రైతుబంధు ఇస్తామని అబద్ధాలు చెప్తున్నారని హరీశ్ రావు సూచించారు. రైతు బంధు ఇచ్చేందుకు ఎన్నికల కోడ్ అడ్డు రాదు.. తాము ఈసీకి లేఖ రాస్తామన్నారు. ఫిబ్రవరి 11లోపు రైతుబంధు ఇవ్వకపోతే రైతులు చీల్చి చెండాడతారని హరీశ్ రావు హెచ్చరించారు.