21 June, 2026 | 3:05 PM

నీట్ యూజీ రీ-ఎగ్జామ్

21-06-2026 02:29 PM

హైదరాబాద్: పేపర్ లీక్ కావడంతో జూన్ 21న దేశవ్యాప్తంగా నీట్-UG 2026 రీ-ఎగ్జామ్ ఆదివారం నిర్వహిస్తున్నారు. ఇవాళ మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.15 గంటలకు వరకు, దివ్యాంగ అభ్యర్థులకు సాయంత్రం 6.20 గంటల వరకు నీట్ పరీక్ష జరుగనుంది. పరీక్ష హాల్ లోకి ఉదయం 11  గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకే అనుమతించి, ఆ తర్వాత పరీక్ష కేంద్రాల గేట్లు మూసివేశారు. ఈ సారి పెండ్ అండ్ పేపర్ విధానంలో నీట్ యూజీ పరీక్షను నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. దేశవ్యాప్తంగా 22.79 లక్షల మంది అభ్యర్థులు రాయనున్నట్లు నీట్ పరీక్షకు 551 కేంద్రాలు, విదేశాల్లో 14 నగరాల్లో నీట్ పరీక్ష రాస్తున్నారు. నీట్ యూజీ రీ-ఎగ్జామ్ విధుల్లో 2 లక్షల మందికి పైగా సిబ్బంది ఉన్నారని, పేపర్ లీకేజ్ ల అవకతవకలకు తావులేకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు సమాచారం. సీసీటీవీ నిఘా, జీపీఎస్ వాహనాలు, ఆధార్ బయోమెట్రిక్ వెరిఫికేషన్ తప్పనిసరి గా చేశారు.