21 June, 2026 | 2:26 PM

తెలంగాణ స్ఫూర్తిప్రదాత ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్

21-06-2026 01:50 PM

హైదరాబాద్: ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ వర్ధంతి సందర్భంగా బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో ఆ మహనీయుడికి బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, పార్టీ నేతలు ఘనంగా నివాళులర్పించారు. తెలంగాణ భావజాల వ్యాప్తి కోసం తన జీవితాన్నే అంకితం చేసిన మహనీయులు, తెలంగాణ స్ఫూర్తిప్రదాత ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ అని కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. జయశంకర్ సార్ వర్ధంతి సందర్భంగా వారిని స్మరించుకుంటూ ఘన నివాళులర్పిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, శ్రీనివాసు గౌడ్, మహమ్మద్ మహమూద్ అలీ, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.