31 March, 2026 | 2:25 PM

Breaking News

ట్యాంక్‌బండ్‌పై 4 కోట్లతో జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే విగ్రహాలు   •   వెలుగులోకి కల్తీ అల్లం పేస్ట్ వ్యవహారం... హైదరాబాద్‌లో వ్యాపారి అరెస్టు   •   చైత్ర మాసం చివరి రోజున ఆలయంలో తొక్కిసలాట: 8 మంది మృతి   •   గురుకుల విద్యను సద్వినియోగం చేసుకోవాలి   •   ఈదురు గాలులకు నేలకొరిగిన వరి, జొన్న పంట   •   మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ఉచిత పశు వైద్య శిబిరం — రైతుల నుంచి విశేష స్పందన   •   హైదరాబాద్‌లో జయలలిత ఇంటికి సీల్   •   ఆకాల వర్షాలకు పంటలు ఆగం.. తీవ్ర ఆందోళ‌న‌లో నిజామాబాద్ రైతులు   •   బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి సీఐడీ నోటీసులు   •   పట్టాలు తప్పిన గూడ్స్.. ట్రాక్‌పై అడ్డంగా పడిన పాల ట్యాంకర్   •  

ప్రజాసమస్యలపై గళం విప్పుతాం: హరీశ్ రావు

08-12-2024 06:30 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): రేపటి నుంచి అసెంబ్లీకి బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ వస్తారో.. రారో.. మీరే చూస్తారుగా అని బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. డిసెంబర్ 9వ తేదీ నుంచి మొదలు కానున్న అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఆదివారం సిద్దిపేట జిల్లా ఎర్రబెల్లి ఫామ్ హౌస్ లో చర్చ జరిగిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను అసెంబ్లీలో ఎండగడతామని హరీశ్ రావు చెప్పారు. ఎన్నికల ముందు చెప్పిన కాంగ్రెస్ ఆర్ గ్యారెంటీలను చట్టబద్ధత చేసే వరకు పోరాడతామని, రైతులకు రెండు విడతల రైతుబంధు ఇవ్వాలని పట్టుబడతామని పేర్కొన్నారు.  ప్రజాసమస్యలపై గళం విప్పుతామని హరీశ్ రావు స్పష్టం చేశారు.