11 July, 2026 | 1:51 AM

రాణించిన హర్మన్, స్మృతి, దీప్తి

11-07-2026 12:00 AM

భారత్ 285 ఆలౌట్

ఇంగ్లాండ్‌తో ఏకైక టెస్ట్

లార్డ్స్, జూలై 10: ఇంగ్లాండ్ మహిళల జట్టుతో జరుగుతున్న ఏకైక టెస్టులో భారత్ తొలి ఇన్నింగ్స్ లో 285 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్, స్మృతి మం ధాన, దీప్తి శర్మ హాఫ్ సెంచరీలతో మెరిసా రు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ ద్వారా ఇరుజట్ల తరఫున ముగ్గురు ఆటగాళ్లు టెస్టు క్రికెట్లో అరంగేట్రం చేశారు. భారత్ తరఫున తెలుగుతేజం శ్రీ చరణి, ఇంగ్లండ్ తరఫున ఎలీస్ కాప్సీ, మాడీ డివిలియర్స్ అరంగేట్రం చేశారు.

భారత వైస్ కెప్టెన్ స్మృతి మంధాన ఈ మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో 300 మ్యాచ్లు పూర్తి చేసుకున్న అతి పిన్న వయస్కురాలైన మహిళా క్రికెటర్గా ప్రపంచ రికార్డు సృష్టించింది. ఆరంభంలోనే షెఫాలీ డకౌటవగా, యస్తికా భాటియా(12) కూడా నిరాశపరిచింది. తర్వాత స్మృతి, రోడ్రిగ్స్ (35) తో కలిసి 64 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. అనంతరం స్మృతి, హర్మన్ కలిసి ఇన్నింగ్స్ నడిపించారు. వీరిద్దరూ 89 పరుగులు జోడించారు. ఈ క్రమంలో స్మృ తి మంధాన 83 (11 ఫోర్లు, 1 సిక్సర్), హర్మన్ ప్రీత్ కౌర్ 58 (7 ఫోర్లు) పరుగులు చేశారు. వీరిద్దరి తర్వాత దీప్తి శర్మ హాఫ్ సెంచరీతో మెరిసింది. ఇంగ్లాండ్ బౌలర్లలో సోఫీ 3, వాంగ్ 2, లారెన్ 2, మ్యాడీ 2 వికెట్లు పడగొట్టారు.