calender_icon.png 7 June, 2025 | 3:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హార్వర్డ్‌లో విదేశీ విద్యార్థులపై నిషేధం

06-06-2025 12:00:00 AM

  1. ట్రంప్ సంచలన నిర్ణయం
  2. జాతీయ భద్రతే కారణమన్న వైట్‌హౌస్
  3. ట్రంప్ చర్యతో విద్యా, దౌత్యవర్గాల్లో ఆందోళన

న్యూఢిల్లీ, జూన్ 5: హార్వర్డ్ యూనివర్సిటీ లో చదవాలనుకొనే విదేశీ విద్యార్థుల వీసాలను పరిమితం చేస్తూ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు సంబంధిత ఉత్తర్వులపై సంతకం చేశారు. కొంతకాలంగా ప్రెసి డె ంట్ ట్రంప్, హార్వర్డ్ యూనివర్సిటీ మధ్య విభేదాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

అంతేకాకు ండా ఇప్పటికే హార్వర్డ్‌తో సంబంధమున్న అం తర్జాతీయ విద్యార్థుల వీసాలను రద్దు చేసే ప్ర క్రియను ప్రారంభించే అధికారాన్ని అమెరికా విదేశాంగమంత్రి మార్కో రూబియోకు కట్టబెట్టారు. కాగా విద్యార్థుల వీసాపై పరిమితుల ని ర్ణయం కేవలం హార్వర్డ్‌కే వర్తిస్తోందని యూఎస్ విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ఈ నిషేధంపై హార్వర్డ్ విశ్వవిద్యాలయం ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు.

విద్యా నై పుణ్యం, ప్రపంచ స్థాయి ప్రతిష్ఠ కోసం తన వి భిన్న అంతర్జాతీయ విద్యార్థుల సమూహంపై ఎక్కువగా ఆధారపడే ఈ సంస్థ, గతంలో కూడా విదేశాల నుంచి విద్యార్థులను చేర్చుకొనే తమ సామర్థ్యాన్ని దెబ్బతీసే ఫెడరల్ ప్రయత్నాలను సవాలు చేస్తూ న్యాయపోరాటం చేసింది.