calender_icon.png 5 July, 2025 | 7:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఒకేరోజు 2200 మంది అరెస్ట్

06-06-2025 12:00:00 AM

  1. అమెరికాలో అక్రమ వలసదారులపై కొరడా
  2. ఐసీఈ అధికారులకు ట్రంప్ బృందం కీలక ఆదేశాలు
  3. సరైన పత్రాలు లేని వలసదారులే ప్రధాన లక్ష్యం

న్యూయార్క్, జూన్ 5: అమెరికాలో అక్రమ వలసదారులపై ట్రంప్ ప్రభుత్వం మరోసారి కొరడా ఝలిపిస్తోంది. తాజాగా గురువారం ఒక్కరోజే ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ఐసీఈ) అధికారులు 2,200 మంది అక్రమ వలసదారులను తమ అదుపులోకి తీసుకున్నారు.

ట్రంప్ బృందంలో కీలక సభ్యులైన అతడి సహాయకులు స్టీఫెన్ మిల్లర్, హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ క్రిస్టి నియోమ్ ఇటీవలే రోజుకు 3వేల మంది వలసదారులను అరెస్ట్ చేయాలని ఐసీఈ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసినట్టు ఎన్‌బీసీ న్యూస్ పేర్కొంది. తాజాగా ఒకేరోజు 2వేలకు పైగా వలసదారులను అరెస్ట్ చేయడం ఐసీఈ డిపార్ట్‌మెంట్‌లో ఒక రికార్డుగా మిగిలిపోనుంది.

ఉన్నతాధికారులు నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేసేందుకు  ఆల్టర్‌నేటివ్ టు డిటెన్షన్ (ఏటీడీ) ప్రోగ్రామ్ కింద టార్గెట్‌లు పూర్తి చేస్తున్నట్టు ఐసీఈ అధికారులు తెలిపారు. సరైన పత్రాలు లేకుండా అమెరికాలో ప్రవేశించిన అక్రమ వలసదారులే ప్రధాన టార్గెట్‌గా అరెస్ట్‌లు కొనసాగుతున్నాయన్నారు.

ఒకవేళ వారి వల్ల సమాజానికి ఎలాంటి ముప్పు లేకపోతే యాంకిల్ మానిటర్లు, స్మార్ట్‌ఫోన్ యాప్‌లు, ఇతర జియో లొకేషన్ పరికరాలతో గమనిస్తుంటారు. ఈ నేపథ్యంలో వీరంతా తరచూ ఐసీఈ కేంద్రాల్లో హాజరుకావాల్సి ఉంటుంది.