calender_icon.png 14 May, 2025 | 7:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీబీఎస్‌ఈ 12వ తరగతి ఫలితాల్లో హార్వెస్ట్ విజయదుందుభి

14-05-2025 01:27:45 AM

భద్రాద్రి కొత్తగూడెం/ఖమ్మం మే 13 (విజయక్రాంతి): 2024 విద్యా సంవత్సరానికిగాను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సి.బి.ఎస్.ఇ) వారు  మంగళవారం ప్రకటించిన పరీక్షా ఫలితాల్లో తమ విద్యార్థినీ, విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించడమే కాకుండా అత్యధిక మార్కులు సాధించి అగ్రశ్రేణిలో నిలిచినట్లు ’హార్వెస్ట్’ గ్రూప్ ఆఫ్ విద్యాసంస్థల యాజమాన్యం ఒక ప్రకటనలో తెలిపారు.

12వ తరగతి పరీక్షా ఫలితాల్లో  తమ పాఠశాలలో 12 వ తరగతి చుదువుతున్న ఎన్.రాఘవేంద్ర నవనీత్ 487/500 మార్కులు సాధించి అగ్రస్థానంలో చిలిచారన్నారు. రేపల్లి శ్రీష 484/500, బి. సాయిచరణ్ 482/500 మార్కులు, ఎం. నాగయశ్వంత్ 482/500 మార్కులు, బి.సిద్దార్థ్ 482/500 మార్కులు, ఎన్.సి. హెచ్. జస్వంత్ సాయి 478/500 మార్కులు, బి. సంజయ్ 477/500 మార్కులు, జి. రాణి ఉమా అలేఖ్య 475/500 మార్కులు, డి.శ్రీనివాస గౌతమ్ రెడ్డి 472/500 మార్కులు, కె. రోహిత 471/500 మార్కులు, టి.డి.వి.ఎస్.ఎస్.నైమాంజలి 470/500 మార్కులు, బి. భార్గవి 470/500 సాధించి విజయదుందుభి మ్రోగించారన్నారు.

తమ పాఠశాలనుండి 12వ తరగతి పరీక్షకు 185 మంది హాజరవగా, అందరూ ఉత్తీర్ణులై 100% ఫలితాలు సాధించారన్నారు. 480 మార్కులకు పైగా సాధించిన వారు 5 మంది, 470 మార్కులకు పైగా 12 మంది, 450కి పైగా 18 మంది సాధించారన్నారు. ఇంగ్లీషులో 45 మంది ఎ1 సాధించగా, గణితంలో 25 మంది ఎ1లు, భౌతిక శాస్త్రంలో 25 మంది ఎ1, రసాయన శాస్త్రంలో 23 మంది, ఎ1, బయాలజీలో 11 మంది ఎ1, పొలిటికల్ సైన్స్లో 6 గురు ఎ1, ఎకనామిక్స్లోలో ఒక్కరు ఎ1, బిజినెస్ స్టడీస్లో ఇద్దరు, కంప్యూటర్ సైన్స్లో 9 మంది, అగ్రికల్చర్లో 7 మంది, అకౌంటెన్సీలో ఇద్దరు సబ్జెక్ట్ వారీగా ఎ1లు సాధించారన్నారు.

హార్వెస్ట్ గ్రూప్ ఆఫ్ విద్యాసంస్థల కరస్పాండెంట్ పి.రవిమారుత్ గ, ప్రిన్సిపల్ ఆర్. పార్వతీ రెడ్డి  విద్యార్థినీ, విద్యార్థులను అభినందించి, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని అభిలషించారు. కార్యక్రమంలో కళాశాల ఉపాధ్యాయ బృదం పాల్గొన్నారు.