14-05-2025 01:26:15 AM
కరీంనగర్, మే13(విజయక్రాంతి): సంచలన ఫలితాలకు నిర్వచనం అల్ఫోర్స్ విద్యా సంస్థలని, చక్కటి ప్రణాళికలతో అత్యుత్తమ ఫలితాలను సాధించడం అల్పోర్స్కే సాధ్యమవుతుందని అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత ఆధినేత డాe వి. నరేందర్ రెడ్డి అన్నారు.
స్థానిక వావిలాలపల్లిలోని అల్ఫోర్స్ ట్రైనిటాట్స్ ప్రాంగణంలో కొత్తపల్లిలోని అల్ఫోర్స్ హై స్కూల్ (సి.బి.యన్.ఇ)కి చెందినటువంటి విద్యార్థులు మంగళవారం ప్రకటించిన సి.బి.యన్.ఇ. 10వ తరగతి మరియు 12వ తరగతి ఫలితాల్లో జాతీయ స్థాయిలో అత్యుత్తమ మార్కులను సాధించడం పట్ల ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేక అభినందన సభకు ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు.
అల్ఫోర్స్ హైస్కూల్ ఆరంభం నాటి నుండి జాతీయ స్థాయి మార్కులతో అత్యుత్తమ ఫలితాలను సాధించడమే కాకుండా అగ్రగామిగా నిలుస్తుందని తెలుపుతూ ఈ సంవత్సరం సైతం జాతీయ స్థాయిలో ప్రభావితం చేసే విధంగా మార్కులు సాధించడం చాలా హర్షించదగ్గ విషయమని చెప్పారు.
10వ తరగతి ఫలితాల్లో
మమోహ్మద్ షాజ్నెన్ తబాసుమ్ జాతీయ స్థాయిలో 99.4% తో 497 మార్కులు సాధిండమే కాకుండా జిల్లా స్థాయిలో అగ్రస్థానంలో నిల్వడం చాలా చారిత్రాత్మకమని తెలిపారు. ఎం.సుచీత్ రెడ్డి 98.6% తో 493 మార్కులు, జె.సుప్రభ 98.4% తో 492 మార్కులు, ఆర్.వేదిక, టి.హార్షిని, 98.2% తో 491 మార్కులు, డి.హార్షిత్, 489 మార్కులు, బి.ఆక్రుతి, సిహెచ్ అనీష్ కుమార్,
రయానుద్దీన్, 488 మార్కులు, ఎ.నక్షత్ర, పి.శ్రీవర్షిత, కె.నక్షత్ర రెడ్డి 486 మార్కులు, ఎస్. శాలిని, అబ్దుల్ రఫే 484 మార్కులు, డి.వివే డి.వివేక్ 483 మార్కులు, టి. హార్షవర్ధన్, ఇ.ప్రనీత్ రెడ్డి 482 మార్కులు, ఆర్య, కె. విస్వజ , రెడ్డి 481 మార్కులు, రమేసా ఫాతీమా, టి.అభిరామ్ రెడ్డి 480 మార్కులు సాధించి ముందంజలో నిలవడమే కాకుండా జిల్లా స్థాయిలోనూ అత్యుత్తమ మార్కులను కైవసం చేసుకొని ధీటుగా సమాదానాన్ని ఇవ్వడం చాలా స్ఫూర్తి దాయకమని తెలిపారు.
12వ తరగతి ఫలితాల్లో
వి.సంజీత రెడ్డి 96.4% తో 482 మార్కులు, ఎన్. అనిరుద్ సాయి 96.4% తో 482 మార్కులు, వి.శశాంక్ రెడ్డి 95.6% తో 478 మార్కులు, జె.వమీకా 94.6% తో 473 మార్కులు, జె.వమీకా 94.6% తో 473 మార్కులు, వి.శశాంక్ రెడ్డి 95.6% తో 478 మార్కులు, ఇ.మృనాలిని 94.6% తో 473 మార్కులు, అబ్దుల్ హాక్ 92.2% తో 461 మార్కులు, టి.సాయి విఘ్నేశ్ 92.2% తో 461 మార్కులు,
డి.శ్రీహాన్ కౌశిక్, 92% తో 460 మార్కులు, ఎన్. మైత్రేయి 91.2% తో 456 మార్కులుసాదించి అత్యుత్తమ స్థానంలో నిలవడమే కాకుండా జిల్లా స్థాయిలోనూ అత్యుత్తమ మార్కులను కైవసం చేసుకొని ధీటుగా నిలిచారని తెలిపారు.
స్ఫూర్తిదాయకంగా విద్యార్థులు 10వ తరగతిలో అత్యధిక సంఖ్యలో 90% మార్కులు సాధించారని మరియు 12వ తరగతి ఫలితాల్లో 13 మంది విద్యార్థులు 90% మార్కులు సాధించడం చాలా చారిత్రాత్మ విజయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయ బృందం మరియు విద్యార్థులు పాల్గొన్నారు.