calender_icon.png 5 December, 2024 | 12:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్వల్పకాలిక రుణ రేట్లు పెంచిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్

08-11-2024 01:15:37 AM

న్యూఢిల్లీ, నవంబర్ 7: ప్రైవేటు రంగ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఎంసీఎల్‌ఆర్ ఆధారిత రుణాలపై వడ్డీ రేట్లను 5 బేసిస్ పాయింట్ల మేర పెంచింది. ఈ పెంపుదలతో స్వల్పకాలిక ఓవర్‌నైట్ రుణంపై రేటు 9.10 శాతం నుంచి 9.15 శాతానికి, ఒక నెల కాలపరిమితిగల రుణంపై రేటు 9.15 శాతం నుంచి 9.20 శాతానికి పెరుగుతుంది. పెరిగిన రేట్లు నవంబర్ 7 నుంచి అమల వుతాయి. ఈ రెండు కాలపరిమితుల రుణాలు మినహా ఇతర రుణ రేట్లను బ్యాంక్ పెంచలేదు. చాలావరకూ ఆటో, వ్యక్తిగత తదితర వినియోగ రుణాలకు ఆధారమైన ఒక ఏడాది ఎంసీఎల్‌ఆర్ రేటును 9.45 శాతం వద్దే అట్టిపెట్టింది.