17 March, 2026 | 9:54 PM

హోటళ్లు, రెస్టారెంట్లలో తనిఖీ

17-03-2026 08:51 PM

- రూ. 20,000 జరిమానా

బెల్లంపల్లి,(విజయక్రాంతి): మంచిర్యాల బెల్లంపల్లి పట్టంలోని హోటళ్లు, రెస్టారెంట్ల టిఫిన్ తదితర తినిబండార వ్యాపార సముదాయాలను మంగళవారం బెల్లంపల్లి మునిసిపల్ కమిషనర్ సంపత్ రెడ్డి తనిఖీ చేశారు. బజార్ ఏరియా, కాల్ టెక్స్ ఏరియాలో ఈ తనిఖీలు చేశారు.  అరేబియన్ క్లాసిక్ నైట్స్ మండి , అబ్దుల్ రెహమాన్ మండి హౌస్, బజార్ ఏరియాలోని వినాయక టిఫిన్, బిర్యాని  హోటళ్లును, రెస్టారెంట్లను తనిఖీ చేసిన మున్సిపల్ కమిషనర్ సంపత్ రెడ్డి పరిశుభ్రతా ప్రమాణాలను పాటించకుండా అపరిశుభ్ర  పరిస్థితుల్లో నిర్వహిస్తున్న వివిధ హోటల్స్ , టిఫిన్ సెంటర్లకు కలిపి  రూ.20,000 జరిమానా విధించారు. యజమానులకు పరిశుభ్రతను కచ్చితంగా పాటించాలని తీవ్రంగా హెచ్చరించారు. నిర్లక్ష్యం పునరావృతం అవుతే దుకాణాలను స్వాధీనం చేసుకుని, మున్సిపల్ చట్టం 2019 ప్రకారం చర్యలు తీసుకొంటామని ఆయన స్పష్టం చేశారు.