8 April, 2026 | 3:50 AM

మల్లన్నసాగర్ కోసం రాక్షసంగా వ్యవహారించాడు

08-04-2026 01:51 AM

ప్రభుత్వ విప్ విజయరమణారావు 

హైదరాబాద్, ఏప్రిల్ 7 (విజయక్రాంతి): బామ్మర్ది రాష్ట్రంలో లేనప్పుడు ఎక్కువ ఫె ర్ఫార్మెన్స్ చూపించాలని హరీశ్‌రావు తెగ ఆరాటపడుతున్నాడని ప్రభుత్వ విప్ విజయరమణరావు విమర్శించారు. పార్టీని బాగా నడుపుతున్నానని చూపించడానికి రోజుకో డ్రామా తయారు చేస్తున్నాడని మంగళవా రం ఒక ప్రకటనలో విమర్శించారు. కేటీఆర్ కంటే తానే బాగా పనిచేస్తానని పార్టీ క్యాడర్‌కు చూపించడానికి హరీశ్‌రావు తాపత్ర యపడుతున్నాడని మండిపడ్డారు. హరీశ్‌రావు నువ్వెంత ఫెర్ఫార్మెన్స్ చూపించినా ఉపయోగం లేదని, బీఆర్‌ఎస్‌లో నిన్ను వాడుకుని వదిలేస్తారు తప్ప ప్రయోజనం లేదన్నారు.

రాష్ట్రంలో పరిశ్రమలు రాకుండా హరీశ్‌రావు అండ్ కంపెనీ కుట్రలు చేస్తున్నదని, గత పదేళ్లలో పరిశ్రమల కోసం అనేక చోట్ల కేసీఆర్ ప్రభుత్వం కూడా భూసేకరణ చేపట్టిందని గుర్తుచేశారు. పరిశ్రమలు వస్తే స్థానికులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు వస్తాయని సీఎం రేవంత్‌రెడ్డి ఆలోచిస్తున్నారన్నారు. భూములు కోల్పోతున్న రైతులకు  పరిహారం, ఉద్యోగం కల్పిస్తున్నామన్నారు.